News November 16, 2024

రామ్మూర్తి నాయుడు మృతిపై రేవంత్ దిగ్భ్రాంతి

image

TG: ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడి మరణంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. అలాగే వారి కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అటు ఏపీ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేశ్, అచ్చెన్నాయుడు, నారాయణ, సవిత కూడా రామ్మూర్తినాయుడి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Similar News

News December 30, 2025

థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకున్నాక ఎప్పుడు ఫుడ్ తీసుకోవాలంటే?

image

థైరాయిడ్ మందులను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ తర్వాత యాభై నిమిషాల తర్వాత ఫుడ్ తీసుకోవాలని చెబుతున్నారు. అప్పుడే శరీరం మందును బాగా గ్రహిస్తుంది. అలాగే థైరాయిడ్ టాబ్లెట్లు వేసుకున్న గంట వరకు థైరాయిడ్ మందుల శోషణకు అంతరాయం కలిగించే యాంటాసిడ్లు, ఇతర మందులను వేసుకోవడం, ఫైబర్, కాల్షియం, ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు తినడం మానుకోవాలని సూచిస్తున్నారు.

News December 30, 2025

451 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

త్రివిధ దళాల్లో 451 ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. UPSC కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2026 ద్వారా వీటిని భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్ డిగ్రీ, డిగ్రీ ఉత్తీర్ణులై, 20 -24ఏళ్ల మధ్య వయసు గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.200, SC, ST, మహిళలకు ఫీజు లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://upsconline.nic.in.

News December 30, 2025

ఐబొమ్మ రవి ‘నకిలీ’లలు!

image

ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో అతడి ‘నకిలీ’లలు బయటపడుతున్నాయి. రవి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ ఖాతా అన్నీ ఫేక్ అని గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రహ్లాద్ అనే వ్యక్తి సర్టిఫికెట్లతో పాన్, డ్రైవింగ్ తీసుకున్నట్లు సమాచారం. బ్యాంక్ అకౌంట్ అంజయ్య పేరుతో ఉందని, ప్రసాద్ అనే వ్యక్తి సర్టిఫికెట్లతోనూ మోసాలకు పాల్పడ్డాడని గుర్తించినట్లు తెలిసింది.