News November 16, 2024
మెరుగైన సమాజం కోసం కృషి చేయాలి: ఎస్పీ
మెరుగైన సమాజం కోసం పోలీసు, ప్రజల మధ్య సత్సంబంధాలు కలిగి ఉండటం అవసరమని జిల్లా ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. విడపనకల్లు మండలం పాల్తూరులో కడ్లే గౌరమ్మ జాతర సందర్భంగా పోలీసు, మైత్రి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా శుభపరిణామం అన్నారు.
Similar News
News November 16, 2024
డీఎస్సీ కోచింగ్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీఎస్సీ కోచింగ్ సెంటర్‌ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ వినోద్ కుమార్‌తో కలిసి కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులు ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
News November 16, 2024
తాడిపత్రి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం
తాడిపత్రి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండల పరిధిలోని వెంకటరెడ్డిపల్లి గ్రామం వద్ద అక్క, తమ్ముడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సందర్భంలో ట్రాక్టర్ ఢీకొనడంతో అక్క అక్కడికక్కడే మృతిచెందగా.. తమ్ముడు నారాయణరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తాడిపత్రి రూరల్ సీఐ శివ గంగాధర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.
News November 16, 2024
పుట్టపర్తి: మృతదేహంతో విద్యార్థుల ఆందోళన
పుట్టపర్తి సమీపంలోని సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి ప్రేమ సాయి సహచర విద్యార్థుల దాడిలో గాయపడి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహంతో విద్యార్థి సంఘం నేతలు ఆందోళనకు దిగారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రేమ సాయి మృతదేహాన్ని రహదారిలో ఉంచి ధర్నా చేశారు. విద్యార్థి మృతికి కారణమైన కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.