News November 16, 2024

వ్యాక్సిన్ల వ్యతిరేకికి వైద్యశాఖ.. ఫార్మా కంపెనీలకు ప్రతికూలమే!

image

వ్యాక్సిన్ల‌కు బ‌ద్ద‌వ్య‌తిరేకి అయిన రాబ‌ర్ట్ ఎఫ్ కెనెడీను US ఆరోగ్య‌ మంత్రిగా ట్రంప్ నామినేట్ చేయడం భారత ఫార్మా సంస్థలపై ప్రభావం చూపవచ్చని తెలుస్తోంది. 2023-24లో విదేశీ ఎగుమ‌తుల్లో అమెరికాకు భార‌త్ 31% మందులు స‌ర‌ఫ‌రా చేసింది. 2024-25లో US$ 7.2 బిలియ‌న్ల విలువైన మందులను విదేశాలకు భారత్ ఎగుమతి చేసింది. కెనడీ రాక భారత్ సహా ఇతర దేశాల సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం.

Similar News

News November 16, 2024

BREAKING: నటి కస్తూరి అరెస్ట్

image

తెలుగు వారిపై వివాదాస్పద <<14525601>>వ్యాఖ్యలు<<>> చేసిన నటి కస్తూరి అరెస్టయ్యారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో చెన్నై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆమె వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించగా, హైదరాబాద్‌లో ఆచూకీ లభ్యమైంది. ఆమెను ప్రస్తుతం పోలీసులు చెన్నై తరలిస్తున్నారు.

News November 16, 2024

ఈ పెట్స్ చాలా కాస్ట్లీ గురూ!

image

జంతువులు, పక్షుల పెంపకం కొంతమందికి హాబీ. మరి కొంతమందికి అవసరం. కానీ కొందరికి మాత్రం అవి స్టేటస్ సింబల్. అందుకే కొన్ని పక్షులు, జంతువులు సామాన్యుడు కనీసం ఊహించలేని ధర పలుకుతుంటుంటాయి. వాటిలో కొన్ని చూస్తే..
టిబెటన్ మాస్టిఫ్: రూ.20 లక్షలు
సవానా పిల్లి: రూ.42 లక్షలు
హయాసింత్ మకావ్: రూ.40 లక్షలు
పామ్ కోకటూ: రూ. 17 లక్షల వరకు
కోయ్ చేపలు: రూ.1.5 లక్షలు

News November 16, 2024

స్టార్ ప్లేయర్లకు గాయాలు.. BGTలో కుర్రాళ్లకు ఛాన్స్?

image

భారత స్టార్ ప్లేయర్లు గాయాలతో సతమతమవుతున్న నేపథ్యంలో ఇండియా-ఏ ఆటగాళ్లు సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్‌ను ఆస్ట్రేలియాలోనే ఉండమని BCCI కోరే అవకాశం ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. రేపు రాత్రి ఇండియా-A జట్టు ఆస్ట్రేలియా నుంచి బయలుదేరనుంది. BGTకి ముందు రాహుల్, గిల్‌కు గాయాలవ్వడం, రోహిత్ గైర్హాజరు వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.