News November 16, 2024
ఈ దేశాల నుంచి జాబ్ ఆఫర్ వస్తే జాగ్రత్త!
Southeast Asia నుంచి, ముఖ్యంగా కంబోడియా, థాయ్‌లాండ్, మయన్మార్ నుంచి జాబ్ ఆఫర్ వస్తే జాగ్రత్తపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 2022 నుంచి ఈ దేశాలకు వెళ్లిన వారిలో 30 వేల మంది భారతీయుల ఆచూకీ లభించకపోవడం కలకలం రేపుతోంది. ఉద్యోగాల పేరుతో రప్పించి వీరితో బలవంతంగా సైబర్ క్రైమ్స్ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై విచారణకు భారత ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నియమించింది.
Similar News
News November 17, 2024
‘ప్రెగ్నెంట్ మ్యాన్’ గురించి తెలుసా?
హార్మోన్ లోపం వల్ల కొందరు ట్రాన్స్‌గా మారుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆడపిల్లగా పుట్టి, లింగమార్పిడి చేసుకుని బిడ్డకు జన్మనిచ్చాడనే విషయం మీకు తెలుసా? USకు చెందిన తామస్ బీటీ తన భాగస్వామి నాన్సీని వివాహం చేసుకునేందుకు లింగమార్పిడి చేసుకుంది. ఆ తర్వాత గర్భం దాల్చగా 2008 జూన్‌లో సహజ ప్రసవం జరిగింది. తాను పాలు ఇవ్వలేనని ఆయన చెప్పారు. 2009లో బీటీ మరో బిడ్డకు జన్మనిచ్చారు.
News November 17, 2024
BGT ఆ జట్టే గెలుస్తుంది: హేడెన్
ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే BGT సిరీస్‌ను 3-1 తేడాతో ఆస్ట్రేలియా గెలుస్తుందని ఆ జట్టు మాజీ ప్లేయర్ మాథ్యూ హేడెన్ జోస్యం చెప్పారు. కోహ్లీ, స్మిత్ వారి జట్లకు కీలకంగా మారతారని చెప్పారు. కమిన్స్, బుమ్రా బౌలింగ్ సిరీస్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడ్డారు. కాగా ఆస్ట్రేలియాలో ఆడిన చివరి రెండు సిరీస్‌లను భారత్ గెలుచుకోవడం గమనార్హం.
News November 17, 2024
మంచి వాళ్లంటే ధనుష్‌కు ఇష్టం ఉండదు: నయనతార భర్త
అందరూ అనుకుంటున్నట్లు హీరో ధనుష్ అంత మంచివాడు కాదని హీరోయిన్ నయనతార భర్త, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ అన్నారు. ఆయనకు మంచి వాళ్లంటే ఇష్టం ఉండదని చెప్పారు. ‘నయనతారకు లీగల్ నోటీసులు పంపడం దుర్మార్గం. సాటి మనిషిగా ధనుష్ చేసింది ముమ్మాటికీ తప్పే. అభిమానులు ఆయన అసలు ముఖం ఏంటో తెలుసుకోవాలి’ అని ఆయన ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేశారు.