News November 16, 2024

శిరోమ‌ణి అకాలీదళ్ చీఫ్ రాజీనామా

image

పంజాబ్ ప్రాంతీయ పార్టీ శిరోమ‌ణి అకాలీదళ్ అధ్య‌క్ష పదవికి సుఖ్‌బీర్ సింగ్ బాద‌ల్ రాజీనామా చేశారు. పార్టీలో ఐదేళ్ల‌కోసారి అధ్య‌క్ష ఎన్నిక‌ జ‌రుగుతుంది. 2019లో ఆయ‌న అధ్య‌క్షుడిగా ఎన్నికై ఐదేళ్లు పూర్తి చేసుకున్నారు. త్వ‌ర‌లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామ‌ని పార్టీ నేత ద‌ల్జీత్ చీమా తెలిపారు. 2007-17 మధ్య ప్ర‌భుత్వంలో ఉండ‌గా బాద‌ల్ మ‌తాచారాల ఉల్లంఘనకు పాల్ప‌డ్డార‌ని ఆయ‌న‌పై విమ‌ర్శ‌లున్నాయి.

Similar News

News November 16, 2024

ట్రంప్‌ను చంపే ఆలోచ‌న లేదు: ఇరాన్‌

image

ట్రంప్‌ను హ‌త్య చేసే ఆలోచ‌న త‌మ‌కు లేద‌ని అమెరికాకు ఇరాన్ వివరణ ఇచ్చింది. Sepలో ఇరాన్‌తో జో బైడెన్ యంత్రాంగం సమావేశమైంది. ట్రంప్‌పై ఏర‌క‌మైన దాడి జ‌రిగినా దాన్ని యుద్ధ చ‌ర్య‌గా ప‌ర‌గ‌ణిస్తామ‌ని US స్ప‌ష్టం చేసింది. దీంతో Octలో ఇరాన్ ‘ఆ ఆలోచన లేద’ని బ‌దులిచ్చిన‌ట్టు సమాచారం. 2020లో ట్రంప్ ఆదేశానుసారం జ‌రిగిన దాడిలో ఇరాన్ మిలిట‌రీ క‌మాండ‌ర్ ఖాసీం సులేమాని హ‌త‌మ‌వ్వడంతో ఇద్దరి మధ్య రగడ ప్రారంభమైంది.

News November 16, 2024

రేపు వరంగల్‌లో విశ్వక్ ‘మెకానిక్ రాకీ’ ప్రీరిలీజ్ ఈవెంట్

image

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘మెకానిక్ రాకీ’ సినిమా ఈనెల 22న రిలీజ్ కానుంది. ఈక్రమంలో మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రేపు వరంగల్ హనుమకొండలోని JNS ఇండోర్ స్టేడియంలో ఈవెంట్ జరగనుంది. సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభమవుతుందని మేకర్స్ తెలియజేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ రొమాంటిక్ చిత్రాన్ని రవితేజ ముళ్లపూడి తెరకెక్కించారు.

News November 16, 2024

రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ

image

తెలంగాణలో రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ అవుతున్నాయి. సన్న రకం వడ్లు క్వింటాకు రూ.500 చొప్పున జమ చేస్తున్నారు. ఈ నెల 11న ప్రయోగాత్మకంగా ఒక రైతు ఖాతాలో క్వింటాకు రూ.500 చొప్పున రూ.30వేలు జమ చేశారు. ఇవాళ రూ.కోటికిపైగా చెక్కులను పౌరసరఫరాల శాఖ జారీ చేయగా, 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి.