News November 16, 2024
‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ రిలీజ్ ఎప్పుడంటే?
విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ మూవీకి సీక్వెల్ రానున్నట్లు ఇటీవల హీరో విశ్వక్ ఓ హింట్ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘ENE-2’ 2026లో రిలీజ్ అవుతుందని ఆయన చెప్పినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ సినిమాలో అదే టీమ్ కొనసాగుతుందా లేదా కొత్త టీమ్‌ను తీసుకుంటారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
Similar News
News November 17, 2024
చంద్రబాబును పరామర్శించిన రాహుల్ గాంధీ
AP: సీఎం చంద్రబాబును ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఫోన్లో పరామర్శించారు. సీఎం సోదరుడి మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుటుంబానికి రాహుల్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలని ఆయన భరోసా ఇచ్చారు.
News November 16, 2024
IAS, IPSలను మేనేజ్మెంట్ స్కూళ్ల నుంచి ఎంపిక చేయాలి: నారాయణ మూర్తి
Infosys నారాయణ మూర్తి మరోసారి వార్తల్లో నిలిచారు. IAS, IPS లాంటి సివిల్ సర్వెంట్లను ఎంపిక చేయడానికి UPSC పరీక్షల మీదే ఆధారపడకుండా మేనేజ్మెంట్ స్కూళ్ల నుంచి ఎంపిక చేయడాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. UPSCకి ఎంపికైన వారికి ముస్సోరీలో శిక్షణ ఇచ్చినట్టే వీరికీ వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వాలన్నారు. 1858 నుంచి అమలులో ఉన్న నియామక విధానాన్ని సంస్కరించాలని ప్రధాని మోదీని కోరారు.
News November 16, 2024
BREAKING: తొలి టెస్టుకు గిల్ దూరం
ఆస్ట్రేలియాతో నవంబర్ 22 నుంచి జరగాల్సిన BGT తొలి టెస్టుకు శుభ్‌మన్ గిల్ దూరమయ్యారు. ఇండియా-ఏతో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా క్యాచ్ పడుతుండగా అతడి వేలికి గాయమైంది. దీంతో తొలి టెస్టుకు అతడికి విశ్రాంతి ఇచ్చిన BCCI రెండో టెస్టు నాటికి కోలుకుంటారని భావిస్తోంది.