News November 16, 2024
ఏ రాష్ట్రంలోనూ ఏడాదిలో 50వేల ఉద్యోగాలివ్వలేదు: రేవంత్

తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏడాదిలో 50వేల ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. మహారాష్ట్రలో ప్రజా తీర్పును షిండే, అజిత్ పవార్ కాలరాశారని మండిపడ్డారు. చంద్రాపూర్‌లో మహావికాస్ అఘాడీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు.
Similar News
News January 12, 2026
యువత భవిష్యత్తును ప్రభుత్వం ప్రమాదంలో పడేసింది: జగన్

AP: కూటమి ప్రభుత్వం రాష్ట్ర, యువత భవిష్యత్తును ప్రమాదంలో పడేసిందని జగన్ విమర్శించారు. ‘యువత దృష్టి పెడితే భారత్ బలంగా ఎదుగుతుందని వివేకానంద అన్నారు. కానీ ప్రభుత్వం యువతను వారి లక్ష్యాన్ని చేరుకోనిస్తుందా? రీయింబర్స్‌మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ₹వేల కోట్లు పెండింగ్‌లో పెట్టింది. ప్రభుత్వం మేల్కొని యవతకు వారి లక్ష్యాలు చేరుకునే వీలు కల్పించాలి’ అని డిమాండ్ చేశారు.
News January 12, 2026
సామాజిక న్యాయమే ధ్యేయం: సీఎం రేవంత్

TG: తమ ప్రభుత్వం సామాజిక న్యాయం కోరుకుంటోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. HYD ప్రజాభవన్‌లో దివ్యాంగులకు రూ.50 కోట్ల పరికరాలు, చిన్నారులకు బాల భరోసా, వృద్ధులకు ప్రణామ్ డే కేర్ సెంటర్ల పథకాల ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు వారంలో రెండు రోజులు ప్రజాభవన్‌లో నేతలు, అధికారులు అందుబాటులో ఉంటున్నట్లు వెల్లడించారు.
News January 12, 2026
పాత స్నేహం కొత్త పార్ట్‌నర్‌షిప్‌గా.. జర్మనీతో బంధంపై మోదీ

భారత్-జర్మనీల బంధం కేవలం చరిత్ర మాత్రమే కాదు.. భవిష్యత్తుకు బలమైన పునాది అని మోదీ అన్నారు. జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడ్రిచ్ మెర్జ్‌తో గాంధీనగర్‌లో భేటీ అయిన ఆయన పాత స్నేహాన్ని కొత్త పార్ట్‌నర్‌షిప్‌గా మారుస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా ట్రేడ్, టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ రంగాల్లో ఇరుదేశాలు కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. మన దేశ మేధావులు, స్వాతంత్ర్య సమరయోధులు జర్మనీపై చూపిన ప్రభావాన్ని గుర్తు చేశారు.


