News November 16, 2024
మహిళల అక్రమ రవాణా పచ్చి అబద్ధం: రోజా
AP: రాష్ట్రంలో YCP హయాంలో వాలంటీర్ల ద్వారా 30 వేల మంది మహిళల అక్రమ రవాణా జరిగిందని TDP, JSP చేసిన ఆరోపణలు తప్పని తేలాయని మాజీ మంత్రి రోజా అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఇది బట్టబయలైందని ఆమె చెప్పారు. ‘గత ఐదేళ్లలో మహిళల అక్రమ రవాణా కేసులు 34 నమోదయ్యాయని స్వయంగా హోంమంత్రే అసెంబ్లీలో ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అధికారం కోసం ఎంతటి అబద్ధాలైనా చెప్తారా? అంటూ ఆమె ఫైర్ అయ్యారు.
Similar News
News November 17, 2024
BGT ఆ జట్టే గెలుస్తుంది: హేడెన్
ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే BGT సిరీస్‌ను 3-1 తేడాతో ఆస్ట్రేలియా గెలుస్తుందని ఆ జట్టు మాజీ ప్లేయర్ మాథ్యూ హేడెన్ జోస్యం చెప్పారు. కోహ్లీ, స్మిత్ వారి జట్లకు కీలకంగా మారతారని చెప్పారు. కమిన్స్, బుమ్రా బౌలింగ్ సిరీస్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడ్డారు. కాగా ఆస్ట్రేలియాలో ఆడిన చివరి రెండు సిరీస్‌లను భారత్ గెలుచుకోవడం గమనార్హం.
News November 17, 2024
మంచి వాళ్లంటే ధనుష్‌కు ఇష్టం ఉండదు: నయనతార భర్త
అందరూ అనుకుంటున్నట్లు హీరో ధనుష్ అంత మంచివాడు కాదని హీరోయిన్ నయనతార భర్త, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ అన్నారు. ఆయనకు మంచి వాళ్లంటే ఇష్టం ఉండదని చెప్పారు. ‘నయనతారకు లీగల్ నోటీసులు పంపడం దుర్మార్గం. సాటి మనిషిగా ధనుష్ చేసింది ముమ్మాటికీ తప్పే. అభిమానులు ఆయన అసలు ముఖం ఏంటో తెలుసుకోవాలి’ అని ఆయన ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేశారు.
News November 17, 2024
చంద్రబాబును పరామర్శించిన రాహుల్ గాంధీ
AP: సీఎం చంద్రబాబును ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఫోన్‌లో పరామర్శించారు. సీఎం సోదరుడి మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుటుంబానికి రాహుల్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలని ఆయన భరోసా ఇచ్చారు.