News November 16, 2024

కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం సవాల్

image

TG: కేసీఆర్ డైరెక్షన్‌తోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ పరీవాహకంలో మొద్దు నిద్ర చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి అసలు తెలంగాణ బిడ్డేనా? ముందు ఆయన డీఎన్ఏ పరీక్షలు చేయించుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎంపీగా కిషన్ రెడ్డి ఏం చేశారో చర్చకు రావాలని సవాల్ విసిరారు.

Similar News

News November 17, 2024

మంచి వాళ్లంటే ధనుష్‌కు ఇష్టం ఉండదు: నయనతార భర్త

image

అందరూ అనుకుంటున్నట్లు హీరో ధనుష్ అంత మంచివాడు కాదని హీరోయిన్ నయనతార భర్త, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ అన్నారు. ఆయనకు మంచి వాళ్లంటే ఇష్టం ఉండదని చెప్పారు. ‘నయనతారకు లీగల్ నోటీసులు పంపడం దుర్మార్గం. సాటి మనిషిగా ధనుష్ చేసింది ముమ్మాటికీ తప్పే. అభిమానులు ఆయన అసలు ముఖం ఏంటో తెలుసుకోవాలి’ అని ఆయన ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేశారు.

News November 17, 2024

చంద్రబాబును పరామర్శించిన రాహుల్ గాంధీ

image

AP: సీఎం చంద్రబాబును ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఫోన్‌లో పరామర్శించారు. సీఎం సోదరుడి మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుటుంబానికి రాహుల్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలని ఆయన భరోసా ఇచ్చారు.

News November 16, 2024

IAS, IPSలను మేనేజ్‌మెంట్ స్కూళ్ల నుంచి ఎంపిక చేయాలి: నారాయణ మూర్తి

image

Infosys నారాయ‌ణ మూర్తి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. IAS, IPS లాంటి సివిల్ స‌ర్వెంట్ల‌ను ఎంపిక చేయ‌డానికి UPSC ప‌రీక్ష‌ల మీదే ఆధార‌ప‌డ‌కుండా మేనేజ్‌మెంట్ స్కూళ్ల నుంచి ఎంపిక చేయ‌డాన్ని ప్ర‌భుత్వం ప‌రిశీలించాల‌ని కోరారు. UPSCకి ఎంపికైన వారికి ముస్సోరీలో శిక్షణ ఇచ్చినట్టే వీరికీ వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వాలన్నారు. 1858 నుంచి అమ‌లులో ఉన్న నియామ‌క విధానాన్ని సంస్క‌రించాల‌ని ప్ర‌ధాని మోదీని కోరారు.