News November 16, 2024
మైదుకూరు: వర్షానికి కూలిన మిద్దె

మైదుకూరు పట్టణ పరిధిలోని నంద్యాల రోడ్డు 18వ వార్డులో నివాసం ఉంటున్న చొక్కమ్ అచ్చమ్మ మిద్దె మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి శనివారం కుప్పకూలింది. ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూలడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అధికారులు స్పందించి పరిహారం అందించి న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.
Similar News
News April 19, 2026
కడప: మీ పిల్లలకు వినికిడి సమస్య ఉందా.?

వినికిడి సమస్య ఉన్న ఎందరో చిన్నారుల జీవితాలు చిన్నాభిన్నం కాకుండా TTD ‘శ్రవణం’ పేరుతో కాపాడుతోంది. సాంకేతికతతో <<19688732>>చెవుడు<<>>ను పోగొట్టవచ్చు. ఇది తెలియని తల్లిదండ్రులు తమ చిన్నారుల విషయంలో నష్టపోతున్నారు. వీరి కోసమే TTD 2006 నుంచి తిరుపతిలోని ఓల్డ్ మెటర్నిటీ ఆసుపత్రి భవనంలో శ్రవణం ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటి వరకు 14 వందల మంది చిన్నారులకు సమ్యను దూరం చేశారు.
# SHARE IT.
News April 19, 2026
తిరుమల శ్రీవారికి ‘రూ.కోటి’ విరాళం ఇస్తే.!

☞దాతతోపాటు నలుగురు ఏడాదిలో 3 రోజులు సుప్రభాత సేవ, 3 రోజులు బ్రేక్ దర్శనం, 4 రోజులు సుపథం ప్రవేశ దర్శనం పొందవచ్చు ☞అంతేకాకుండా 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, దుప్పట-1, రవికె-1, మహాప్రసాదం ప్యాకెట్లు-10, ఒకసారి వేద ఆశీర్వచనం పొందవచ్చు ☞వీటితోపాటు రూ.3 వేల విలువ చేసే వసతి గదుల సదుపాయం 3 రోజులు కల్పిస్తారు ☞జీవిత కాలంలో ఒకసారి దాత 5గ్రా. శ్రీవారి బంగారు డాలర్, 50 గ్రా.సిల్వర్ డాలర్ పొందవచ్చు.
News April 19, 2026
కడప కలెక్టరేట్ వద్ద మాస్టార్ల ధర్నా.!

కడప కలెక్టరేట్ వద్ద శనివారం APTF ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా APTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను ప్రభుత్వం రోడ్డెక్కేలా చేయడం తగదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సాచివేత ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.


