News November 16, 2024

కన్నీళ్లు పెట్టుకున్న హీరో.. ఓదార్చిన సీఎం CBN

image

పితృ వియోగంతో శోకసంద్రంలో మునిగిపోయిన టాలీవుడ్ హీరో నారా రోహిత్‌ను తన పెద్దనాన్న, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. రామ్మూర్తి కుమారులైన గిరీశ్, రోహిత్‌లను హత్తుకుని ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. కాగా, రామ్మూర్తికి నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన AIG ఆస్పత్రికి చేరుకుంటున్నారు.

Similar News

News January 31, 2026

NCPల విలీనంపై సందిగ్ధత ఏర్పడింది: శరద్ పవార్

image

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణంతో NCPల విలీనంపై సందిగ్ధత ఏర్పడిందని NCP వ్యవస్థాపకుడు శరద్ పవార్ అన్నారు. అజిత్, MLA జయంత్ పాటిల్ మధ్య జరగాల్సిన చర్చలు నిలిచిపోయాయని తెలిపారు. ఫిబ్రవరి 12 డెడ్‌లైన్‌గా అజిత్ చర్చలు జరిపారని, ప్రస్తుతం ఆయన శిబిరంలోని నాయకులు విలీనానికి ఆసక్తిగా లేరన్నారు. ఈరోజు సా.5 గంటలకు సునేత్రా పవార్ డిప్యూటీ CMగా ప్రమాణం చేస్తున్నందున ఈ కామెంట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

News January 31, 2026

ఇజ్రాయెల్ వలలో ట్రంప్.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో దిమ్మతిరిగే నిజాలు!

image

ఎప్‌స్టీన్ తాజా ఫైల్స్ సంచలనం రేపుతున్నాయి. ఇజ్రాయెల్ వలలో ట్రంప్ చిక్కుకున్నారని, ఆయన నిర్ణయాలపై ఆ దేశ ప్రభావం బలంగా ఉందని ఈ ఫైల్స్ వెల్లడించాయి. రష్యా పెట్టుబడులు, ఇజ్రాయెల్ అనుకూల నెట్‌వర్క్స్‌తో ట్రంప్ అల్లుడు కుష్నర్‌కు సంబంధాలు ఉండడంతో వైట్ హౌస్ నిర్ణయాలను ప్రభావితం చేశారని ఆరోపించాయి. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ Mossad కోసం ఎప్‌స్టీన్ లాయర్ పనిచేశారని ఈ రిపోర్ట్ పేర్కొనడం సంచలనంగా మారింది.

News January 31, 2026

సూర్యలానే సంజూను బ్యాకప్ చేయాలి: రైనా

image

NZతో జరుగుతున్న T20 సిరీస్‌లో ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న సంజూకు మాజీ ప్లేయర్ సురేశ్ రైనా మద్దతుగా నిలిచారు. కెప్టెన్ సూర్యకుమార్ ఏడాది పాటు రన్స్ చేయలేకపోయినా టీమ్ మేనేజ్‌మెంట్ అతడిని బ్యాకప్ చేసిందని చెప్పారు. సంజూ విషయంలోనూ ఇలాగే జరగాలన్నారు. అతనికి అవకాశాలు ఇస్తూ ఉంటే కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తారని రైనా అభిప్రాయం వ్యక్తం చేశారు. NZతో జరిగిన తొలి 4 T20ల్లో సంజూ 40 పరుగులే చేశారు.