News November 16, 2024
‘ప్రభుత్వ కార్యాలయాల తరలింపును విరమించుకోవాలి’
కర్నూలులోని లోకాయుక్త, హెచ్ఆర్సీ, ఏపీ ఈఆర్ఏ, వక్ఫ్ ట్రిబ్యునల్ కార్యాలయాలను అమరావతికి తరలించాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం వారు కర్నూలు కలెక్టరేట్లో కలెక్టర్ రంజిత్ బాషాకు వినతిపత్రం అందజేశారు. కర్నూలులోని ప్రభుత్వ కార్యాలయాలను అమరావతికి తీసుకెళ్లడం అన్యాయం అని తెలిపారు.
Similar News
News November 17, 2024
నా భర్తను చిత్రహింసలకు గురి చేశారు: వర్రా కల్యాణి
ఈనెల 8న కర్నూలు టోల్‌ప్లాజా వద్ద తన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని, 12న మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు YCP నేత వర్రా రవీంద్రా రెడ్డి భార్య వర్రా కల్యాణి తెలిపారు. శనివారం కడపలో ఆమె ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ 3 రోజులు తన భర్తను చిత్రహింసలకు గురిచేసి, తప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారని ఆరోపించారు. రవీంద్రా రెడ్డిని ఈనెల 11న అదుపులోకి తీసుకున్నారన్నది అవాస్తవం అని పేర్కొన్నారు.
News November 17, 2024
వచ్చే నెల 10వ తేదీ వరకు అవగాహన కల్పించండి: కలెక్టర్
19న ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 19 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు జిల్లా అంతటా ‘హమారా శౌచాలయ, హమారా సమ్మాన్’ పేరుతో అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ పీ.రంజిత్ బాషా తెలిపారు. శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ‘హమారా శౌచాలయ హమారా సమ్మాన్’ కార్యక్రమంపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, జడ్పీ సీఈఓ, పంచాయతీ రాజ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
News November 17, 2024
శ్రీశైలంలో భక్తిశ్రద్ధలతో ఆకాశదీపం పూజలు
కార్తీకమాసం పురస్కరించుకుని శ్రీశైలం దేవస్థానంలో శనివారం రాత్రి కార్తీక ఆకాశ దీపం పూజలు నిర్వహించారు. ఇన్ఛార్జ్ ఈఓ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పండితులు, అర్చకులు స్థానిక ధ్వజస్తంభం వద్ద ముందుగా గణపతిపూజ, దీపపూజ నిర్వహించారు. అనంతరం ప్రత్యేక ఇత్తడిపాత్రలో దీపాన్ని ఉంచి ధ్వజస్తంభానికి ఏర్పాటు చేశారు. కార్తీకమాసంలో ఆకాశదీపాన్ని దర్శించుకోవడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయని పండితులు తెలిపారు.