News November 16, 2024

రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు

image

AP: సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు రేపు స్వగ్రామం నారావారిపల్లెలో జరుగుతాయి. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు చంద్రబాబు రేపు ఇక్కడకు రానున్నారు. ఆయనతో పాటు కుటుంబసభ్యులు, నందమూరి కుటుంబసభ్యులు కూడా వస్తారు. కాగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో రామ్మూర్తి కన్నుమూసిన విషయం తెలిసిందే.

Similar News

News January 31, 2026

ఊరినే అమ్మకానికి పెట్టారు.. ఎక్కడంటే?

image

ఆస్ట్రేలియాలోని లికోలా అనే బుజ్జి పట్టణం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ నివసించేది ఐదుగురు మాత్రమే. ఒక జనరల్ స్టోర్, పెట్రోల్ బంక్, కారవాన్ పార్క్ ఉన్న ఈ ఊరు మొత్తం ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంది. దీని ధర 10మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు(రూ.63కోట్లు). 50 ఏళ్లుగా సేవా కార్యక్రమాలకు నిలయంగా ఉన్న ఈ ఊరిని ఒక్కసారిగా అమ్మాలని లయన్స్ క్లబ్ నిర్ణయించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

News January 31, 2026

ఫిబ్రవరి 12న బ్యాంకులు బంద్!

image

కేంద్రం తెచ్చిన 4 కార్మిక చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో FEB 12న జరగనున్న దేశవ్యాప్త <<18979407>>సమ్మెకు<<>> బ్యాంకు సంఘాలు మద్దతిచ్చాయి. కార్మిక సంఘాలతో కలిసి స్ట్రైక్‌లో పాల్గొనాలని AIBEA, AIBOA, BEFI నిర్ణయించాయి. ఉద్యోగులెవరూ విధులకు హాజరుకాకూడదని డిసైడ్ అయ్యాయి. దీంతో ఆరోజు బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. వారానికి 5 రోజుల పనిదినాలకు డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు.

News January 31, 2026

తిరుమల నెయ్యి.. క్లీన్ చిట్ వచ్చినట్లు YCP ప్రచారం: పయ్యావుల

image

AP: తిరుమలలో లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని 2022లో CFTRI రిపోర్ట్ ఇచ్చిందని, దాన్ని YCP తొక్కిపెట్టిందని మంత్రి పయ్యావుల ఆరోపించారు. ‘మేం వచ్చాకే కల్తీ వ్యవహారం బయటపడింది. నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలున్నాయని NDDB రిపోర్టులో తేలింది. అయినప్పటికీ సిట్ క్లీన్ చిట్ ఇచ్చినట్లు YCP ప్రచారం చేసుకుంటోంది. YCP హయాంలో TTD నిబంధనల మార్పుతోనే దుర్మార్గపు పనులకు పునాది పడింది’ అని మండిపడ్డారు.