News November 16, 2024

మంత్రి హామీ.. RTC ఉద్యోగుల ధర్నాలు వాయిదా

image

AP: ఈ నెల 19, 20 తేదీల్లో చేపట్టాల్సిన నిరసనలను ఎంప్లాయీస్ యూనియన్ వాయిదా వేసుకుంది. RTC ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇచ్చిన హామీతో ధర్నాలను వాయిదా వేస్తున్నట్లు EU పేర్కొంది. RTC ఉద్యోగుల అన్ని ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి ఈ సందర్భంగా ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదరరావుతో ఫోన్‌లో మాట్లాడారు.

Similar News

News November 17, 2024

సొంత తప్పిదాల వల్ల కూడా ఉద్యోగ మోసాలు: సర్వే

image

ఉద్యోగాల పేరుతో జ‌రిగే మోసాల్లో 75% ఆశావ‌హుల తప్పిదాల వల్ల కూడా జరుగుతున్నట్టు ఓ స‌ర్వేలో తేలింది. ఫేక్ రిక్రూట‌ర్‌ల‌ను గుర్తించ‌డంలో విఫ‌ల‌మై మోస‌గాళ్ల‌కు న‌గ‌దు చెల్లిస్తున్నార‌ని, సున్నిత‌మైన స‌మాచారాన్ని పంచుకుంటున్నారని వెల్లడైంది. వివిధ రంగాల్లోని 1,427 మందిపై జ‌రిపిన స‌ర్వేలో అత్య‌ధికులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నకిలీ ఉద్యోగ ప్రకటనల్ని తరచూ చూస్తున్నట్లు మరికొందరు పేర్కొన్నారు.

News November 17, 2024

కులం పేరుతో విభజించాలని కాంగ్రెస్ చూస్తోంది: పవన్

image

దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురాగలిగే సత్తా పీఎం మోదీకి మాత్రమే ఉందని AP Dy.CM పవన్ అన్నారు. మహారాష్ట్రలోని భోకర్‌లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘హిందు, ముస్లిం, క్రిస్టియన్ అనే భేద భావం మన దేశంలో లేదు. అమీర్, సల్మాన్, షారుఖ్ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్లుగా ఉన్నారు. అబ్దుల్ కలామ్‌ను గుండెల్లో పెట్టుకున్న దేశం మనది. ప్రజలను కులం, రిజర్వేషన్ల పేరుతో విడగొట్టాలని కాంగ్రెస్ చూస్తోంది’ అని ఆరోపించారు.

News November 17, 2024

BGT: తొలి టెస్టుకు తుది జట్టు ఇదేనా?

image

BGTలో తొలి టెస్టు ఆరంభానికి మరో 5 రోజులు ఉంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగడం లేదని తెలుస్తోంది. వీరి స్థానంలో సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ జట్టులో చోటు దక్కించుకుంటారని టాక్. జైస్వాల్‌తో కలిసి సుదర్శన్ ఇన్నింగ్స్ ఆరంభించే ఛాన్స్ ఉంది. ప్రాబబుల్ జట్టు: జైస్వాల్, సుదర్శన్, కోహ్లీ, రాహుల్, పంత్, జురెల్/నితీశ్, అశ్విన్, జడేజా, బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్