News November 16, 2024
BREAKING: నటి కస్తూరి అరెస్ట్

తెలుగు వారిపై వివాదాస్పద <<14525601>>వ్యాఖ్యలు<<>> చేసిన నటి కస్తూరి అరెస్టయ్యారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో చెన్నై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆమె వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించగా, హైదరాబాద్‌లో ఆచూకీ లభ్యమైంది. ఆమెను ప్రస్తుతం పోలీసులు చెన్నై తరలిస్తున్నారు.
Similar News
News April 16, 2026
భర్త శ్రమ, భార్య ప్రతిభ.. ఇంటర్‌లో 991 మార్కులు

AP: ఇంటర్ ఫలితాల్లో ఓ ఆటో డ్రైవర్ భార్య సత్తా చాటారు. కర్నూల్(D) ఆదోనికి చెందిన ఎస్.సుజాత స్థానికంగా ఓ ప్రైవేట్ కాలేజీలో వొకేషనల్ ఇంటర్ చదివారు. సెకండియర్ MPHWలో 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించారు. ఆటో నడుపుతూ చదివిస్తున్న భర్త జయరాం కష్టానికి ఫలితంగా ఆమె ఇలా ప్రతిభ చాటడంపై ప్రశంసలొస్తున్నాయి.
News April 16, 2026
INDలో పెరుగుతున్న ‘స్లీప్ షేమింగ్’.. ఏంటిది?

తక్కువ నిద్రపోవడాన్ని గొప్పగా, ఎక్కువ పోతే సోమరితనంగా భావించే అలవాటు భారతీయుల్లో పెరిగిపోతోందని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీన్నే ‘స్లీప్ షేమింగ్’ అంటారు. కష్టపడి పనిచేయడం అంటే నిద్రను త్యాగం చేయడమేనన్న తప్పుడు ఆలోచన వల్ల చాలామంది ఒత్తిడికి గురవుతున్నారన్నారు. అయితే సరిగ్గా నిద్రపోతేనే ఆరోగ్యం, పనిలో వేగం పెరుగుతాయని సూచిస్తున్నారు. తగినంత విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో అవసరమంటున్నారు.
News April 16, 2026
కొడుకుల కోసం వెళ్తే తండ్రులతో సినిమాలు లాక్!

బింబిసార డైరెక్టర్ వశిష్ఠ గురించి ఓ ఆసక్తికర విషయం వినిపిస్తోంది. ఆయన స్టోరీ లైన్స్ వారసుల కోసం సిద్ధం చేసుకుంటే వారి తండ్రులు కనెక్ట్ అవుతున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజాగా ఆయన నందమూరి మోక్షజ్ఞ కోసం కథను రెడీ చేసుకొని బాలయ్య దగ్గరకు వెళ్లారు. అయితే మరో లైన్ NBKకి నచ్చడంతో ముందు తనతో సినిమా తీయాలని సూచించారట. అంతకుముందు రామ్ చరణ్ కోసం వెళ్తే చిరుతో ‘విశ్వంభర’ ఓకే అయినట్లు సమాచారం.


