News November 16, 2024
ISRO-SpaceX ప్రయోగం.. త్వరలో విమానాల్లో ఇంటర్నెట్ సేవలు

అంతరిక్ష ప్రయోగాల్లో ISRO-SpaceX మొదటి సారి చేతులు కలిపాయి. ఇస్రో కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-N2 ఉపగ్రహాన్ని ఫాల్కన్-9 రాకెట్ ద్వారా వచ్చే వారం ప్రయోగించనున్నారు. 3000 మీటర్ల ఎత్తులో ఉన్న విమానాల్లో సైతం ఇంటర్నెట్ సేవల్ని అందించడానికి ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. GSLV Mk3 రాకెట్ 4 వేల KGల బరువును మోయగలదు. GSAT-N2 4700 KGలు ఉండడంతో SpaceXతో ఇస్రో జట్టుకట్టింది.
Similar News
News December 28, 2025
అధికారులు చూసుకుంటారు.. నాకేం సంబంధం?: భూమన

AP: తిరుమల కల్తీ నెయ్యి కేసులో TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డిని సిట్ 2 గంటలకు పైగా విచారించింది. అధికారుల ప్రశ్నలకు తనకేమీ తెలియదని ఆయన చెప్పినట్లు తెలిసింది. నెయ్యి సరఫరా గురించి అధికారులు చూసుకుంటారని, తామెందుకు పట్టించుకుంటామని అన్నట్లు సమాచారం. నాణ్యత లేదని నెయ్యిని తిరస్కరించడం ఎప్పటి నుంచో జరుగుతోందని చెప్పారని, NTR హయాం నుంచే ట్యాంకర్లను తిప్పి పంపుతున్నారని చెప్పినట్లు తెలుస్తోంది.
News December 28, 2025
వెన్నును బలిష్ఠంగా చేసే మేరుదండ ముద్ర

మేరుదండ ముద్రను రోజూ సాధన చెయ్యడం వల్ల వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగుపడటంతో పాటు వెన్నునొప్పిని తగ్గించడానికి సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ముందుగా వజ్రాసనం/ సుఖాసనంలో కూర్చోని చేతులను తొడలపై ఉంచాలి. బొటన వేలును నిటారుగా పెట్టి మిగతా నాలుగువేళ్లను మడిచి ఉంచాలి. దీన్ని రోజూ సాధన చెయ్యడం వల్ల వెన్ను నొప్పి కూడా తగ్గుతుందంటున్నారు.
News December 28, 2025
వైకుంఠ ద్వార దర్శనంతో ఆరోగ్యం!

ఉత్తర ద్వార దర్శనం జ్ఞాన వికాసానికి సూచిక. మన శరీరంలో ఉత్తర భాగంలో ఉండే ‘సహస్రార చక్రం’ ఆధ్యాత్మిక ఉన్నతిని సూచిస్తుంది. ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించడం అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి, దైవిక జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకోవడమే. ఆలయానికి వెళ్లలేని వారు ఏకాగ్రతతో మనసులోనే ఆ శ్రీహరిని స్మరించుకున్నా సంపూర్ణ ఫలితం దక్కుతుంది. భక్తితో చేసే ఈ దర్శనం మనకు శాశ్వత శాంతిని, మోక్షాన్ని చేకూరుస్తుంది.


