News November 16, 2024

ట్రంప్‌ను చంపే ఆలోచ‌న లేదు: ఇరాన్‌

image

ట్రంప్‌ను హ‌త్య చేసే ఆలోచ‌న త‌మ‌కు లేద‌ని అమెరికాకు ఇరాన్ వివరణ ఇచ్చింది. Sepలో ఇరాన్‌తో జో బైడెన్ యంత్రాంగం సమావేశమైంది. ట్రంప్‌పై ఏర‌క‌మైన దాడి జ‌రిగినా దాన్ని యుద్ధ చ‌ర్య‌గా ప‌ర‌గ‌ణిస్తామ‌ని US స్ప‌ష్టం చేసింది. దీంతో Octలో ఇరాన్ ‘ఆ ఆలోచన లేద’ని బ‌దులిచ్చిన‌ట్టు సమాచారం. 2020లో ట్రంప్ ఆదేశానుసారం జ‌రిగిన దాడిలో ఇరాన్ మిలిట‌రీ క‌మాండ‌ర్ ఖాసీం సులేమాని హ‌త‌మ‌వ్వడంతో ఇద్దరి మధ్య రగడ ప్రారంభమైంది.

Similar News

News January 14, 2026

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 పోస్టులు

image

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ అర్హతగల వారి నుంచి జనవరి 15 నుంచి 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: bankofmaharashtra.bank.in

News January 14, 2026

ఊగిసలాటలో స్టాక్ మార్కెట్ సూచీలు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఎర్లీ ట్రేడింగ్‌లో ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 9:40 గంటల సమయానికి సెన్సెక్స్ 27 పాయింట్లు కుంగి 83,599 వద్ద.. నిఫ్టీ 15 పాయింట్లు నష్టపోయి 25,716 దగ్గర ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో NTPC, టాటా స్టీల్, BEL, ట్రెంట్, M&M షేర్లు లాభాల్లో.. ఏషియన్ పెయింట్స్, TCS, బజాజ్ ఫిన్‌సర్వ్, HCL టెక్, ఇండిగో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News January 14, 2026

బదోనే ఎందుకు.. క్లారిటీ ఇచ్చిన బ్యాటింగ్ కోచ్

image

సీనియర్లను కాదని వాషింగ్టన్ సుందర్ స్థానంలో న్యూజిలాండ్ సిరీస్‌కు <<18835903>>ఆయుష్ బదోని<<>>ని సెలక్ట్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ వివరణ ఇచ్చారు. ఇండియా-A టీమ్‌లో బదోని పర్ఫార్మెన్స్ బాగుందని.. IPLలోనూ రాణించినట్లు గుర్తుచేశారు. రైట్-ఆర్మ్ ఆఫ్-బ్రేక్ బౌలర్ అయిన బదోని.. సుందర్ ఆల్‌రౌండర్ స్థానాన్ని సరిగ్గా భర్తీ చేయగలడని భావించినట్లు వివరించారు.