News November 16, 2024
BCCI రూ.వేలకోట్ల ఆదాయానికి రిలయన్స్ దెబ్బ?

BCCI, ICCకి భారీ షాక్ తగిలేలా ఉంది. క్రికెట్ టోర్నీల మీడియా హక్కుల కోసం వెంపర్లాడబోమని రిలయన్స్ డిస్నీ మీడియా జేవీ వైస్‌ఛైర్మన్ ఉదయ్ శంకర్ కుండబద్దలు కొట్టడమే ఇందుకు కారణం. తమకిక FOMO ఆందోళన లేదన్నారు. ఒకవేళ మిస్సైనా బిజినెస్‌కు పెద్దగా నష్టమేమీ ఉండదన్నారు. ఈ స్ట్రాటజీ మీడియా హక్కులపై భారీ ప్రభావం చూపిస్తుందని, కంపెనీల మధ్య పోటీ లేకుంటే బోర్డులకు ఆదాయం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
Similar News
News January 12, 2026
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు

కాన్పూర్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<
News January 12, 2026
నెలలో పెళ్లి.. అమెరికా అదుపులో నేవీ అధికారి!

అమెరికా స్వాధీనం చేసుకున్న <<18803079>>రష్యా నౌకలో<<>> ముగ్గురు భారతీయులు ఉండటం తెలిసిందే. అందులో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ రిక్షిత్ చౌహాన్(26) కూడా ఉన్నారు. ఫిబ్రవరి 19న ఆయన పెళ్లి జరగాల్సి ఉంది. రష్యా సంస్థ ఆయన్ను తొలిసారి సముద్ర విధులకు పంపింది. ఈ క్రమంలో ఈనెల 7న చౌహాన్‌తో మాట్లాడామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన కొడుకును సురక్షితంగా తీసుకురావాలని తల్లి రీతాదేవి వేడుకుంటున్నారు.
News January 12, 2026
18 గంటలు పని చేసినా సమయం సరిపోవడం లేదు: CM

TG: తాను రెండేళ్ల పాలనలో ఒక్కరోజూ సెలవు తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘సెలవు తీసుకోవాలని ముందురోజు అనుకుంటా. కానీ ఏదో ఒక పని ఉంటుంది. సీఎం పదవి వస్తే చాలా సంతోషంగా ఉండొచ్చని అనుకుంటారు. కానీ ఇప్పుడు బాధ్యతలు మరింత పెరిగాయి. రోజుకు 18 గంటలు పని చేసినా సమయం సరిపోవడం లేదు. ఇది బరువుగా చూడట్లేదు. బాధ్యతగా చూస్తున్నా’ అని ఉద్యోగులతో సమావేశంలో పేర్కొన్నారు.


