News November 17, 2024
‘పుష్ప 2’ ఈవెంట్కు సుకుమార్ దూరం.. ఎందుకంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీ ట్రైలర్ లాంఛ్ రేపు పట్నాలో జరగనుంది. ఈ వేడుకకు డైరెక్టర్ సుకుమార్ హాజరవడం లేదని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పెండింగ్ పనులు ఎక్కువగా ఉండటంతో వాటిని ఫినిష్ చేసేందుకు ఆయన హైదరాబాద్లోనే ఉంటారని సమాచారం. మరోవైపు రేపటి ఈవెంట్లో బిగ్ బాస్ ఫేమ్ అక్షర్ సింగ్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. వచ్చే నెల 5న మూవీ రిలీజ్ కానుంది.
Similar News
News December 27, 2025
ప్రాజెక్టులపై అసెంబ్లీలో PPT ప్రజెంటేషన్!

TG: ఈనెల 29 నుంచి ఆరంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులపై అధికార, విపక్షాల మధ్య హోరాహోరీ చర్చ జరిగే అవకాశముంది. PPT ప్రజెంటేషన్ ద్వారా దీటుగా జవాబిచ్చేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమవుతున్నారు. అదే తరహాలో తానూ PPTతో ప్రశ్నించడానికి BRS నేత హరీశ్ రెడీ అవుతున్నారు. ఒకవేళ తనను అందుకు అనుమతించకపోతే సభ వెలుపల PPT ప్రదర్శించాలని యోచిస్తున్నారు.
News December 27, 2025
చలి ఎక్కువగా అనిపిస్తోందా? ఇవి కూడా కారణం కావొచ్చు

కొందరికి చలి ఎక్కువగా అనిపించడం అనేది శరీరంలోని వివిధ సమస్యలను సూచిస్తుందంటున్నారు నిపుణులు. శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా పనిచేయనప్పుడు చలి ఎక్కువగా అనిపిస్తుంది. ఎక్కువసేపు కూర్చోవడం, శారీరక శ్రమ లేని వారు ఈ కోవకు చెందుతారు. అలాగే విటమిన్ B12, విటమిన్ D లోపం ఉన్నవారిలో కూడా చలి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వీరు పాలకూర, బీట్రూట్, గుడ్లు, చేపలు, చికెన్ పాలు, పెరుగు తినాలని సూచిస్తున్నారు.
News December 27, 2025
బంగ్లాదేశ్ కోసం ధర్మయుద్ధం చేశాం: ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్

1971లో బంగ్లాలో పాక్ సైన్యం చేసిన అరాచకాలను చూస్తూ ఉండలేకపోయిన భారత్ ‘ధర్మయుద్ధం’ చేసిందని ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ గుర్తుచేశారు. పాక్ ఎప్పుడూ అధర్మాన్నే నమ్ముకుందని.. మనం మాత్రం శత్రువులకు కూడా గౌరవం ఇచ్చామన్నారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే కచ్చితంగా తగిన సమయంలో అది బుద్ధి చెబుతుందని పరోక్షంగా బంగ్లాను హెచ్చరించారు.


