News November 17, 2024
ఈనెల 24న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష: DEO

ఖమ్మం: 2024-25 విద్యా సం.కి గాను నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఈనెల 24న నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ వర్మ తెలిపారు. ఉ.9-30 నుంచి మ.12:30 వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. కావున విద్యార్థులు తమ పరీక్షా హాల్ టికెట్లను వెబ్సైట్ https://bse.telangana.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా విద్యా శాఖాధికారి పేర్కొన్నారు.
Similar News
News April 17, 2026
ఖమ్మం: బియ్యం అక్రమ రవాణాదారుపై పీడీ యాక్ట్

రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆత్మకూరి జగదీష్‌పై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు సీపీ సునీల్ దత్ శుక్రవారం తెలిపారు. నిందితుడిపై ఖమ్మంలో 13 కేసులతో పాటు ఇతర జిల్లాల్లోనూ కేసులు ఉన్నాయని, అతడిని చంచలగూడ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. పేదల బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.
News April 17, 2026
నిర్మాణ కార్మికుల కూలీ పెంపు: ఉప కార్మిక కమిషనర్

ఖమ్మం జిల్లాలో నిర్మాణ రంగ కార్మికుల కూలీ రేట్లను 10 శాతం పెంచుతూ కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఉప కార్మిక కమిషనర్ కె.విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన చర్చల్లో బిల్డర్లు, యూనియన్లు అంగీకారం తెలిపాయి. దీని ప్రకారం మేస్త్రీ కూలీ రూ.1,050, సహాయకుల కూలీ రూ.735 కు చేరింది. మే 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయని, సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.
News April 17, 2026
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఖమ్మం RTO కార్యాలయంలో నిర్వహించిన “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి తరలించిన వారికి రాహ-వీర్ పథకం క్రింద రూ.25 వేలు ప్రోత్సాహకంగా అందజేస్తామని చెప్పారు. సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడం మన రక్షణ కోసమేనన్నారు.


