News November 17, 2024

NLG: నెలాఖరు నాటికి పూర్తి చేయాలి: కలెక్టర్

image

నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవన నిర్మాణాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె SLBC కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని తనిఖీ చేశారు. టీజీ ఎస్ఎం ఐడీసీ చీఫ్ ఇంజనీర్ దేవేందర్ కుమార్ వైద్య కళాశాల భవన నిర్మాణ పనుల పరిస్థితిని వివరించారు.

Similar News

News February 3, 2026

నల్గొండ: చెట్టుపై నుంచి బావిలో పడి కాపరి మృతి

image

కేతేపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. తుంగతుర్తి గ్రామానికి చెందిన మేకల కాపరి జటంగి సైదులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు. సోమవారం మేకల మేత కోసం చెట్టు కొమ్మలు కొడుతుండగా కాలు జారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

News February 3, 2026

NLG: B.P.Ed &D.P.Ed విద్యార్థులకు గమనిక

image

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో B.P.Ed & D.P.Ed సెమిస్టర్-1 రెగ్యులర్ సంబంధిచి పరీక్షలో స్వల్ప మార్పు చేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 11వ తారీఖున మున్సిపల్ ఎన్నికలు కారణంగా ఆరోజు జరగవలసిన పరీక్షను 13వ తేదీకి రీ-షెడ్యూల్ చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సంబంధిత కళాశాలలు, విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.

News February 3, 2026

NLG: MA హిస్టరీ, టూరిజం పరీక్షల షెడ్యూల్ ఇదే.!

image

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో MA హిస్టరీ, టూరిజం సెమిస్టర్-1( R-25) సంబంధించిన పరీక్షల టైం టేబుల్‌ని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈనెల 10 నుంచి 20 మధ్య పరీక్షలు జరుగుతాయని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. సంబంధిత కళాశాలలు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. పూర్తి పరీక్షల టైం టేబుల్‌కు అధికారిక ఎంజీయూ వెబ్సైట్‌ను సందర్శించాలన్నారు.