News November 17, 2024
PHOTOS: బీజేపీ నేతల ‘మూసీ నిద్ర’
TG: ‘మూసీ ప్రక్షాళన చేయండి. కానీ పేదల ఇళ్లు కూలగొట్టకండి’ అనే నినాదంతో మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు నిద్ర చేస్తున్నారు. కిషన్ రెడ్డి, కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్‌తో పాటు మరి కొంతమంది నేతలు వేర్వేరు చోట్ల బాధితులతో ముచ్చటించారు. అంబర్‌పేట నియోజకవర్గంలోని తులసిరాం నగర్ బస్తీలో కిషన్ రెడ్డి, ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈటల రోడ్డుపై బైఠాయించి బాధితులకు మద్దతు తెలిపారు.
Similar News
News November 17, 2024
ఈనెల 20న వేములవాడకు సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 20న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న అనంతరం రాజన్న ఆలయ గుడి చెరువు మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వేములవాడ ఆలయం, జిల్లా సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా సీఎం పర్యటన ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కాగా ఎల్లుండి వరంగల్‌లో సీఎం పర్యటించనున్నారు.
News November 17, 2024
ఆ రెండింటికి తేడా తెలియకుండానే ఐదేళ్లు పాలించారు: హోంమంత్రి
AP: YCP హయాంలో మహిళల అక్రమ రవాణా జరగలేదని <<14629630>>రోజా చేసిన ట్వీట్‌పై<<>> హోంమంత్రి అనిత స్పందించారు. ‘వ్యక్తిగత, మానసిక కారణాలతో కనపడకుండా పోతే అది మిస్సింగ్. ఉచ్చువేసి క్రయవిక్రయాలు జరిపి కనిపించకుండా మాయం చేస్తే అది హ్యుమన్ ట్రాఫికింగ్. ఈ రెండింటికి తేడా తెలియకుండానే గత ఐదేళ్లు పాలించారు. అవినీతి తప్ప ప్రజాక్షేమం ఏమాత్రం పట్టని ఇలాంటి వారు పరిపాలించడం ప్రజల పాలిట దౌర్భాగ్యం’ అని ట్వీట్ చేశారు.
News November 17, 2024
నేడు, రేపు గ్రూప్-3 పరీక్షలు.. సూచనలివే!
TG: ఇవాళ, రేపు గ్రూప్-3 పరీక్షలు జరగనుండగా, అభ్యర్థులకు TGPSC పలు సూచనలు చేసింది.
➤ఒరిజినల్ ఐడీతో పరీక్షకు రావాలి.
➤ఎగ్జామ్‌కు గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
➤ఉ.9.30 తర్వాత, మ.2.30 తర్వాత పరీక్షకు అనుమతించరు.
➤అభ్యర్థులు పేపర్-1కు తీసుకొచ్చిన హాల్ టికెట్‌నే మిగతా పేపర్లకు తీసుకురావాలి.
➤నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకూ హాల్‌టికెట్, ప్రశ్న పత్రాల్ని భద్రంగా పెట్టుకోవాలి.