News November 17, 2024
సొంత తప్పిదాల వల్ల కూడా ఉద్యోగ మోసాలు: సర్వే
ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల్లో 75% ఆశావహుల తప్పిదాల వల్ల కూడా జరుగుతున్నట్టు ఓ సర్వేలో తేలింది. ఫేక్ రిక్రూటర్‌లను గుర్తించడంలో విఫలమై మోసగాళ్లకు నగదు చెల్లిస్తున్నారని, సున్నితమైన సమాచారాన్ని పంచుకుంటున్నారని వెల్లడైంది. వివిధ రంగాల్లోని 1,427 మందిపై జరిపిన సర్వేలో అత్యధికులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నకిలీ ఉద్యోగ ప్రకటనల్ని తరచూ చూస్తున్నట్లు మరికొందరు పేర్కొన్నారు.
Similar News
News November 17, 2024
వచ్చే వారం ‘RC16’ షురూ?
బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్-జాన్వీ కపూర్ జంటగా నటించనున్న ‘RC16’ మూవీ షూటింగ్ వచ్చే వారం ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందుకోసం మైసూర్‌లో భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని మూవీ వర్గాలు వెల్లడించాయి. క్రీడా నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో నిండిన కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు టాక్. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
News November 17, 2024
కులగణన.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
TG: సమగ్ర కులగణనలో సేకరించిన వివరాలను అత్యంత భద్రంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ సర్వేలో సేకరించిన డేటాను ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో ఎంట్రీ చేస్తారు. ఆ డేటా ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుపై బీసీ డెడికేటెడ్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.
News November 17, 2024
కొడాలి నానిపై కేసు నమోదు
AP: మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖ థర్డ్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన చంద్రబాబు, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు, సోషల్ మీడియా శ్రేణులపై కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.