News November 17, 2024
నాలుగు ఉద్యోగాలు సాధించిన కేశరాజుపల్లి వాసి

నల్గొండ పట్టణ పరిధి కేశరాజుపల్లికి చెందిన ప్రేమ్ – సునీతల కుమారుడు ప్రణబ్ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. 2019లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 2020లో ఫైర్‌మెన్, 2024 ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్-4లో రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా కొనసాగుతున్న ప్రణబ్ రెవెన్యూ శాఖలో చేరనున్నట్లు తెలిపారు.
Similar News
News January 14, 2026
నల్గొండ జిల్లాలో టుడే టాప్ న్యూస్

నల్గొండ ఇక కార్పొరేషన్… గెజిట్ విడుదల
మాడుగులపల్లి: చైనా మాంజా నుంచి సేఫ్.. ఐడియా అదిరింది
నల్గొండ: పుర పోరు.. రిజర్వేషన్లపై ఉత్కంఠ
నల్గొండ: భోగి మంటల్లో జీవో ప్రతులు దగ్ధం
కట్టంగూరు: పాలకవర్గాలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక
నల్గొండ: రైస్ మిల్లులు.. అక్రమాలకు నిలయాలు
మిర్యాలగూడ: జిల్లా డిమాండ్.. మళ్లీ తెరపైకి
కట్టంగూరు: ఘనంగా గోదారంగనాథ స్వామి కళ్యాణం
దేవరకొండలో ఆర్టీసీ కార్మికుల నిరసన
News January 14, 2026
NLG: లండన్ వేదికగా చేనేత కళా వైభవం

చండూరుకు చెందిన చేనేత కళాకారుడు చిలుకూరి శ్రీనివాస్ అంతర్జాతీయ వేదికపై భారతీయ చేనేత నైపుణ్యాన్ని చాటనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు లండన్‌లో జరిగే ‘స్ప్రింగ్ ఫెయిర్’ వర్తక ప్రదర్శనలో చేనేత లైవ్ డెమో ఇచ్చేందుకు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల 29న ఆయన లండన్ బయలుదేరనున్నారు. తన ఎంపికకు సహకరించిన కేంద్ర చేనేత సేవా కేంద్రం డైరెక్టర్ అరుణ్‌కు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.
News January 14, 2026
నల్గొండ: 23, 24 తేదీల్లో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు

జిల్లాకు చెందిన వర్కింగ్ జర్నలిస్టులకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈ నెల 23, 24 తేదీల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ సెక్రటరీ ఎన్. వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల జర్నలిస్టులు 20 తేదిలోగా నల్గొండ పౌర సంబంధాల అధికారిని సంప్రదించాలన్నారు.


