News November 17, 2024
నా భర్తను చిత్రహింసలకు గురి చేశారు: వర్రా కల్యాణి

ఈనెల 8న కర్నూలు టోల్‌ప్లాజా వద్ద తన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని, 12న మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు YCP నేత వర్రా రవీంద్రా రెడ్డి భార్య వర్రా కల్యాణి తెలిపారు. శనివారం కడపలో ఆమె ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ 3 రోజులు తన భర్తను చిత్రహింసలకు గురిచేసి, తప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారని ఆరోపించారు. రవీంద్రా రెడ్డిని ఈనెల 11న అదుపులోకి తీసుకున్నారన్నది అవాస్తవం అని పేర్కొన్నారు.
Similar News
News November 2, 2025
తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి యువకుడి మృతి.!

మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామంలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వీరేంద్ర తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి మృతి చెందాడు. స్నానానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నది ఉద్ధృతికి కొట్టుకుపోయి మరణించాడని స్థానికులు తెలిపారు. కొడుకును కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గ్రామస్థులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
News November 1, 2025
స్పెషల్ ఆఫీసర్లు మండలాలకు వెళ్లాలి: కర్నూలు కలెక్టర్

కర్నూలు జిల్లాలో నియోజకవర్గ, మండల స్పెషల్ ఆఫీసర్లు ప్రతి వారం తప్పనిసరిగా మండలాలకు వెళ్లి ఆసుపత్రులు, పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ సెంటర్లు, సచివాలయాలను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో ఆమె మాట్లాడుతూ.. బీసీ హాస్టళ్లలో పదో తరగతి ఉత్తీర్ణతా శాతం పెంచాలన్నారు. హాస్టళ్లలో తాగునీరు, భోజనం, టాయిలెట్లపై చర్యలు చేపట్టాలని సూచించారు.
News October 31, 2025
సీఎం చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు సరికాదు: తిక్కారెడ్డి

‘మొంథా’ తుఫాను సమయంలో ప్రజలను కాపాడిన సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని జగన్ తప్పుబట్టడం ఆశ్చర్యకరమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి శుక్రవారం విమర్శించారు. తుఫాన్ సమయంలో ప్రాణ నష్టం లేకుండా చూసిన చంద్రబాబుపై వ్యాఖ్యలు చేయడం జగన్‌కు తగదన్నారు. సీఎంగా ఉన్నప్పుడు తుఫాన్లు వచ్చినా గడప దాటని జగన్, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు.


