News November 17, 2024

విజయవాడ: వైసీపీని వీడేందుకు సిద్ధమైన కీలక నేత.?

image

ఎన్నికల ముందు వైసీపీలో చేరిన పోతిన మహేశ్‌ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు విజయవాడలో ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా పశ్చిమ సీటును బీజేపీకి ఇవ్వడంతో ఆయన జనసేనను వీడి వైసీపీలో చేరారు. ఎన్నికల ఫలితాల అనంతరం సెంట్రల్‌లో ఓటమిపాలైన వెలంపల్లి శ్రీనివాస్‌ను విజయవాడ పశ్చిమ ఇన్‌ఛార్జిగా వైసీపీ అధిష్ఠానం నియమించింది. దీంతో వైసీపీని వీడేందుకు మహేశ్ సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. 

Similar News

News April 16, 2026

భర్త మరణం తట్టుకోలేక.. భార్య కన్నుమూత

image

కృష్ణాజిల్లా గూడూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కప్పలదొడ్డికి చెందిన తిరుమలశెట్టి వీర రాఘవరావు (66) అనారోగ్యంతో బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య పద్మావతి (61) కొద్దిసేపటికే స్పృహ కోల్పోయారు. ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆమె కూడా ప్రాణాలు విడిచారు. గంటల వ్యవధిలోనే దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News April 15, 2026

టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్లుగా ఉమ్మడి కృష్ణాజిల్లా నేతలు

image

టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్లుగా ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలకు మరోసారి సీఎం చంద్రబాబు అవకాశం కల్పించారు. గతంలో పొలిట్ బ్యూరో మెంబర్లుగా పని చేసిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ సీనియర్ నాయకులైన వర్ల రామయ్యను మరోసారి పొలిట్ బ్యూరో మెంబర్లుగా నియమించారు. జగ్గయపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యను కూడా పొలిట్ బ్యూరో మెంబర్‌గా నియమించారు. తాతయ్య గతంలో టీడీపీ జాతీయ కోశాధికారిగా వ్యవహరించారు.