News November 17, 2024
నెతన్యాహు ఇంటిపై ఫ్లాష్ బాంబు దాడి
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై ఫ్లాష్ బాంబుల దాడి కలకలం రేపింది. రెండు బాంబులు ఆయన ఇంటి గార్డెన్‌లో పడ్డట్లు రక్షణ మంత్రి కట్జ్ తెలిపారు. ఆ సమయంలో నెతన్యాహు, కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని వెల్లడించారు. దాడి వల్ల ఎలాంటి నష్టం జరగలేదని, ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. కాగా ఈ అటాక్ పని ఇరాన్‌దేనని భావిస్తున్నారు.
Similar News
News November 17, 2024
నాగచైతన్య-శోభిత పెళ్లి శుభలేఖ ఇదేనా?
అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ వివాహం డిసెంబర్ 4న జరగనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే తాజాగా వారి వెడ్డింగ్ ఇన్విటేషన్ అంటూ ఓ శుభలేఖ వైరల్ అవుతోంది. ఇందులో నాగచైతన్య తరఫున అక్కినేని నాగేశ్వరరావు-అన్నపూర్ణ, దగ్గుబాటి రామానాయుడు-రాజేశ్వరి పేర్లు కూడా ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి జరగనుందని సమాచారం. త్వరలోనే దీనిపై అక్కినేని ఫ్యామిలీ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
News November 17, 2024
లౌడ్‌స్పీకర్లతో టార్చర్ చేస్తున్న నార్త్ కొరియా
సౌత్ కొరియాలోని సరిహద్దు గ్రామాల ప్రజలను వేధించడానికి <<13338040>>నార్త్ కొరియా<<>> లౌడ్‌స్పీకర్లతో యుద్ధం మొదలుపెట్టింది. దెయ్యాల అరుపులు, క్రాష్ సౌండ్స్‌ను రోజంతా ప్లే చేస్తూనే ఉంది. దీన్ని ‘నాయిస్ బాంబింగ్’గా పిలుస్తున్నారు. ఈ శబ్దాల వల్ల తమకు నిద్ర కరవైందని, తలనొప్పి, మానసిక సమస్యలు వస్తున్నాయని డాంగ్సన్ గ్రామ ప్రజలు చెబుతున్నారు. కొన్ని నెలలుగా ఇదే తంతు <<13411726>>కొనసాగుతోందని<<>> వాపోతున్నారు.
News November 17, 2024
LeT సీఈవో అంటూ ఆర్బీఐకి బెదిరింపు కాల్
ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లష్కరే తోయిబా CEOను అంటూ ఓ వ్యక్తి బెదిరింపు కాల్ చేశాడు. శనివారం ఆర్బీఐ కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేసిన నిందితుడు ‘నేను లష్కరే తోయిబా సీఈవో. బ్యాక్ వే మూసేయండి. ఎలక్ట్రిక్ కారు చెడిపోయింది’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే, ఇదో ఆకతాయి పనిలా పోలీసులు అనుమానిస్తున్నారు. RBI భద్రతా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.