News November 17, 2024
పుతిన్‌కు మస్క్ ఫోన్ కాల్.. విచారణకు డెమొక్రాట్ల డిమాండ్

ట్రంప్ ప్రభుత్వంలో <<14596564>>కీలక పదవి<<>> దక్కించుకున్న ఎలాన్ మస్క్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన అక్టోబర్‌లో రష్యా ప్రెసిడెంట్ పుతిన్, ఆ దేశ అధికారులతో అనధికారికంగా పలు ఒప్పందాలపై ఫోన్‌లో మాట్లాడినట్లు ఇద్దరు డెమొక్రటిక్ సెనేటర్లు ఆరోపించారు. ఈ క్రమంలో మస్క్‌పై జాతీయ భద్రతా కారణాలపై దర్యాప్తు చేయాలని లేఖ రాశారు. ఇలాంటి వ్యక్తికి GOVT ఎఫీషియెన్సీ బాధ్యతలు అప్పగించడం కరెక్టేనా అని ప్రశ్నించారు.
Similar News
News February 23, 2026
₹130 కోట్ల భారీ రివార్డు ఉన్న క్రిమినల్ హతం!

ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకడు, మెక్సికోలోని అత్యంత శక్తిమంతమైన ‘జాలిస్కో న్యూ జనరేషన్’ (CJNG) డ్రగ్ కార్టెల్ బాస్ ‘ఎల్ మెంచో’ ఆర్మీ ఆపరేషన్‌లో హతమయ్యాడు. ఆదివారం తెల్లవారుజామున జాలిస్కో రాష్ట్రంలోని తపాల్పాలో జరిగిన మెరుపు దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. మెక్సికో సిటీకి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. అతనిపై US ప్రభుత్వం గతంలో సుమారు ₹130 కోట్ల రివార్డును ప్రకటించింది.
News February 23, 2026
ఆ మోజే టీమ్ఇండియా కొంపముంచిందా?

SAతో మ్యాచ్‌లో భారత బ్యాటర్ల తీరు చూస్తే ఒక సమస్య కనిపించింది. అదే ‘డాట్ బాల్స్’. క్రీజులో పాతుకుపోయి స్ట్రైక్ రొటేట్ చేయడం కంటే ప్రతి బాల్‌ను బౌండరీకి పంపాలనే ఆరాటమే భారత్‌ను దెబ్బతీసినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. సింగిల్స్ తీస్తూ ప్రెజర్ తగ్గించుకోవాల్సింది పోయి వరుసగా డాట్ బాల్స్ ఆడటంతో ఒత్తిడి పెరిగి వికెట్లు పారేసుకున్నారు. కేవలం బౌండరీలపైనే ఆధారపడటం వల్ల మధ్యలో ఇన్నింగ్స్ మందగించింది.
News February 23, 2026
పాక్ వైమానిక దాడులపై భారత్ ఫైర్

అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోవడం దారుణమని విదేశీ వ్యవహారాల శాఖ మండిపడింది. తన దేశంలోని అంతర్గత వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని పేర్కొంది. అఫ్గానిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేసింది.


