News November 17, 2024

వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి.. పూజల వివరాలు ఇవే: ఈవో

image

సీఎం రేవంత్ రెడ్డి బుధవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దర్శనానికి వస్తున్నారు. భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా భక్తుల సౌలభ్యార్థం అర్జిత సేవల్లో స్వల్ప మార్పులు చేసినట్లు ఈవో వినోద్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్వ దర్శనం, కోడె మొక్కుబడి, భక్తులచే నిర్వహించే అభిషేకాలు నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 17, 2024

KNR: కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి!

image

కరీంనగర్ జిల్లాలో ఈ సమయానికి ధాన్యంతో కల కళకళలాడాల్సిన కొనుగోలు కేంద్రాలు వెలవెల బోతున్నాయి. రైతులు కోతలు ప్రారంభించినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడంతో రైస్ మిల్లర్లకు తక్కువ ధరకు అమ్ముకున్నారు. ప్రస్తుతం కేంద్రంలో కూడా తాలు పేరిట అధిక కాంట వేయడంతో రైతులు నష్టాలు పాలవుతున్నారు. రైతులు నేరుగా రైస్ మిల్లర్లను ఆశ్రయించడంతో కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి.

News November 17, 2024

GREAT.. సిరిసిల్ల: రైతు బిడ్డకు గ్రూప్-4 ఉద్యోగం

image

సిరిసిల్ల జిలా తంగళ్లపల్లి మండలానికి చెందిన ఓ రైతు బిడ్డ గ్రూప్-4 ఉద్యోగం సాధించాడు. అంకుసాపూర్ గ్రామానికి చెందిన కొమురయ్య కుమారుడు రాజ్‌కుమార్‌కు గతంలో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అయినప్పటికీ ఉద్యోగం వదులుకొని పై ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యారు. SI ఉద్యోగం మెయిన్స్‌లో 4 మార్కులతో చేజారింది. అయినా పట్టు వదలకుండా చదివి గ్రూప్-4 ఉద్యోగం(రెవెన్యూశాఖ) జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించారు.

News November 17, 2024

KNR: గ్రూప్-3 పరీక్ష రాసేందుకు 56 కేంద్రాలు ఏర్పాట్లు: కలెక్టర్

image

జిల్లాలో ఈనెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్‌-3 పరీక్షలు సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. ఈమేరకు పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్, రూట్ అధికారులు, ప్రాంతీయ కో-ఆర్డినేటర్లకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 26,415 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని, వీరి కోసం 56 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు.