News November 17, 2024
ఈనెల 18న అభ్యర్థులకు కౌన్సెలింగ్

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో వార్డెన్లు, పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 18న కర్నూలులోని డీఈవో కార్యాలయంలో కౌన్సెలింగ్ ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని ఆయన సూచించారు.
Similar News
News February 28, 2026
కర్నూలు: ‘పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇవ్వాలి’

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ సిరి శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. పెండింగ్ లేకుండా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద వచ్చిన దరఖాస్తులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలన్నారు.
News February 28, 2026
కర్నూలు: ‘ఏప్రిల్ నాటికి 23,077 గృహాలకు సోలార్’

కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో విద్యుత్ శాఖాధికారులు, కాంట్రాక్టర్లతో జిల్లా కలెక్టర్ సిరి సమీక్ష నిర్వహించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద జిల్లాలోని 23,077 ఎస్సీ/ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లపై ఏప్రిల్ నాటికి సోలార్ ఇన్‌స్టాలేషన్లు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇన్వర్టర్లు, మీటర్లు, ఎర్త్ వైరింగ్‌లో నాణ్యత పాటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఎం కుసుమ్ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.
News February 28, 2026
కర్నూలు: ‘ఈ ఏడాదికి 45 లక్షల మొక్కలు నాటాలి’

కర్నూలు కలెక్టరేట్‌లో శనివారం 2026-27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే Plantation గురించి జిల్లా కలెక్టర్ సిరి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని, అందుకుగాను 45 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.


