News November 17, 2024

ఢిల్లీ మంత్రి రాజీనామా

image

ఢిల్లీ మంత్రి కైలాష్ గహ్లోత్ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఈయన ఆమ్ ఆద్మీ పార్టీలో సీనియర్. అరవింద్ కేజ్రీవాల్ తరువాత ముఖ్యమంత్రి పదవి ఈయనకే వస్తుందనే ప్రచారం కూడా జరిగింది.

Similar News

News April 20, 2026

IPL: అదే మా సక్సెస్ మంత్ర: శ్రేయాస్ అయ్యర్

image

LSGపై విజయం అనంతరం తమ ఆటగాళ్ల గెలుపు మంత్రాన్ని PBKS కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ రివీల్ చేశారు. టీమ్ పర్ఫార్మెన్స్‌పై సంత‌ృప్తిగా ఉన్నట్లు తెలిపారు. ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కానోలీ బాదిన బాదుడుకు ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నారు. ‘వాళ్ల హిట్టింగ్ చూస్తుంటే.. ఫాస్ట్ బౌలర్లనూ బ్యాక్ ఫుట్‌పై స్ట్రైట్ సిక్సర్లు కొట్టడం అమేజింగ్’ అని కొనియాడారు. ప్లేయర్లకు ఫ్రీడమ్ ఇవ్వడమే తమ సక్సెస్ మంత్ర అని తెలిపారు.

News April 20, 2026

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ నిర్మాతల కొత్త సంఘం

image

హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ ఇండస్ట్రీల నిర్మాతలు ఏకమై ‘సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ (SIFPA)ను ఏర్పాటు చేశారు. థియేటర్ల యజమానులు నిర్ణయించిన 8 వారాల OTT విండోను ఈ బాడీ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిపై ఎవరికీ ఎటువంటి హామీ పత్రాలు ఇవ్వొద్దని నిర్మాతలకు సూచించింది. సమస్యల పరిష్కారం కోసం 4 భాషల ప్రతినిధులతో స్టీరింగ్ కమిటీనీ నియమించారు.

News April 20, 2026

ఏప్రిల్ 20: చరిత్రలో ఈరోజు

image

✒ 1889: జర్మనీ నియంత హిట్లర్ జననం
✒ 1950: ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు జననం
✒ 1930: సినీ రచయిత త్రిపురనేని మహారథి జననం
✒ 1972: సినీ నటి మమతా కులకర్ణి జననం
✒ 1972: సినీ నటి అంజలా జవేరీ జననం
✒ 1992: టాలీవుడ్ తొలి నేపథ్య గాయకుడు ఎమ్ఎస్ రామారావు మరణం