News November 17, 2024

ప్రధాని మోదీకి నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం

image

ప్రధాని మోదీకి నైజీరియాలో అరుదైన గౌరవం దక్కింది. ఆ దేశ రెండో అత్యున్నత పురస్కారం ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైగర్’ను ఆయనకు ప్రకటించింది. 1969లో క్వీన్ ఎలిజబెత్ తర్వాత ఈ అవార్డు పొందిన విదేశీ ప్రముఖుడు మోదీ మాత్రమే కావడం విశేషం. ఇది ఆయనకు అందిన 17వ విదేశీ పురస్కారం. కాగా మోదీ నైజీరియా నుంచి జీ20 లీడర్స్ సమ్మిట్ కోసం బ్రెజిల్ వెళ్తారు. ఆ తర్వాత గయానాలో పర్యటిస్తారు.

Similar News

News November 17, 2024

‘పుష్ప రూల్ మొదలు’.. యూట్యూబ్ ట్వీట్

image

మరికొన్ని క్షణాల్లో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ ట్రైలర్ రిలీజ్ కానుంది. ఎన్నో అంచనాలతో విడుదలవుతుండటంతో యూట్యూబ్ సైతం అందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ‘పుష్ప రూల్ బిగిన్స్’ అని యూట్యూబ్ ఇండియా ట్వీట్ చేసింది. గత రికార్డులన్నింటినీ ఈ ట్రైలర్ బ్రేక్ చేస్తుందని, యూట్యూబ్ షేక్ అవడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా పట్నాలో జరుగుతోన్న ఈవెంట్‌కు వేలాదిగా ప్రేక్షకులు తరలివచ్చారు.

News November 17, 2024

కానిస్టేబుల్ అభ్యర్థులకు BIG ALERT

image

APలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఫిజికల్ టెస్టులకు <>దరఖాస్తు <<>>చేసుకునేందుకు అభ్యర్థులకు ఇచ్చిన అవకాశం నవంబర్ 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. డిసెంబర్ చివరి వారంలో PMT, PET టెస్టులు నిర్వహించేందుకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఏమైనా సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించండి.

News November 17, 2024

తెలంగాణ రికార్డు సృష్టించింది: ఉత్తమ్

image

వరి దిగుబడిలో తెలంగాణ రికార్డు సృష్టించిందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావడం రైతులు సాధించిన ఘన విజయమని అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 3 బ్యారేజ్‌ల్లో నీటి వినియోగం లేకుండానే దిగుబడి సాధించడం ప్రభుత్వం, అధికారుల పనితీరు, రైతన్నల అంకితభావానికి నిదర్శనమన్నారు. ఉమ్మడి APలోనూ ఇంతటి పంట పండిన సందర్భమే లేదన్నారు.