News November 17, 2024
బీఆర్ఎస్‌ను నిషేధించాలి: బండి సంజయ్
తెలంగాణలో BRSను నిషేధించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న BRS విధ్వంసకర పార్టీ అని ఆరోపించారు. ఆ పార్టీ నేతలను నియంత్రించాల్సిన బాధ్యత సీఎందేనని, ఆయన అసమర్థత వల్లే వారు రెచ్చిపోతున్నారని విమర్శించారు. ఇక TGలో ఇద్దరు సీఎంలు(రేవంత్, KTR) ఉన్నారని, కాంగ్రెస్, BRS కలిసి రాష్ట్రంలో నాటకాలు ఆడుతున్నాయని బండి ధ్వజమెత్తారు.
Similar News
News November 17, 2024
రేపటి నుంచి శ్రీవారి సేవా టికెట్ల బుకింగ్
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఫిబ్రవరి-2025కు సంబంధించి లక్కీ డిప్(సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం) ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ నవంబర్ 18వ తేదీ ఉ.10 గంటల నుంచి నవంబర్ 20వ తేదీ ఉ.10 వరకు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో పేర్లు వచ్చిన భక్తులు 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ పేమెంట్ చేయవచ్చని TTD తెలిపింది.
News November 17, 2024
మొబైల్ వినియోగదారులకు అలర్ట్
బ్రెయిన్ క్యాన్సర్‌కు మొబైల్ వినియోగంతో సంబంధం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆస్ట్రేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్ అండ్ న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ & WHO జరిపిన అధ్యయనంలో ఫోన్‌కు మెదడు & హెడ్ క్యాన్సర్‌తో సంబంధం లేదని తెలిసింది. 1994 నుంచి 2022 మధ్యకాలంలో 5వేల మందిపై స్టడీ చేసిన తర్వాత ఈ విషయం కనుగొన్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ విద్యుదయస్కాంత క్షేత్రాలను క్యాన్సర్ కారకాలుగా గతంలో IARC పేర్కొంది.
News November 17, 2024
‘చెప్పులు’ నిషేధించాలని స్వతంత్ర అభ్యర్థి విజ్ఞప్తి.. ఎందుకంటే?
MHలో పరాందా నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి పోలింగ్ బూత్‌ల వద్ద చెప్పులు నిషేధించాలని ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేశారు. తనకు EC చెప్పుల గుర్తు కేటాయించడమే దీనికి కారణమని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ప్రకారం అభ్యర్థుల గుర్తు పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రదర్శించడం నిషేధమని, అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను నిలబెట్టేందుకు ఈ రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు.