News November 17, 2024

బీజింగ్‌లో చేసినట్లే ఢిల్లీలో చేయండి: నెటిజన్లు

image

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మితిమీరిపోతోంది. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలుష్యం తగ్గట్లేదు. దీంతో ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో చైనా రాజధాని బీజింగ్‌లో పన్నెండేళ్లలో తగ్గిపోయిన కాలుష్యం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. అక్కడ 2012లో కాలుష్యంతో నిండిపోయి పొగ కమ్మేయగా.. ఇప్పుడు గాలి నాణ్యత పూర్తిగా మారిపోయింది. అలాంటి ఏర్పాట్లు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.

Similar News

News November 18, 2024

ఢిల్లీలో తగ్గిన గాలి నాణ్యత.. సీఎం కీలక ఆదేశాలు

image

ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోవడంతో సీఎం ఆతిశీ కీలక ఆదేశాలు జారీ చేశారు. స్టేజ్-4 ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 10, 12వ తరగతి విద్యార్థులకు తప్పా మిగతా వారికి ఫిజికల్ క్లాసులు నిర్వహించవద్దని ట్వీట్ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్కూళ్లు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని స్పష్టం చేశారు. దీంతో పాటు నగరంలోకి ట్రక్కుల ప్రవేశంపై ప్రభుత్వం నిషేధం విధించింది.

News November 18, 2024

3 రోజుల్లో రూ.127.64 కోట్ల వసూళ్లు

image

సూర్య, దిశా పటానీ కాంబినేషన్లో శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కంగువా’ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల కలెక్షన్లు దాటేసింది. 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.127.64 కోట్ల వసూళ్లు సాధించినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. గురువారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.

News November 18, 2024

డిసెంబర్ 15 నాటికి కొత్త విధానం: నారాయణ

image

AP: భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి త్వరలోనే కొత్త విధానం అమల్లోకి తీసుకొస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. డిసెంబర్ 15 నాటికి ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని, దీనికి సంబంధించి త్వరలోనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామన్నారు. 20 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాతే కొత్త విధానం రూపొందించామని నెల్లూరులో అధికారులతో సమీక్షలో మంత్రి చెప్పారు. ప్రజలు తమ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు.