News November 17, 2024

తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-3 పరీక్ష

image

TG: గ్రూప్-3 పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ పేపర్-1, పేపర్-2 పరీక్ష జరగగా రేపు ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-3 పరీక్ష జరగనుంది. కాగా నిమిషం నిబంధన కారణంగా పలువురు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అధికారులు అనుమతించలేదు.

Similar News

News January 13, 2026

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు క్లోజ్

image

ఏపీలో సంచలనం రేపిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును విజయవాడ ACB కోర్టు మూసివేసింది. CID నివేదికకు ఆమోదం తెలుపుతూ CM చంద్రబాబు సహా 37 మందిపై విచారణను క్లోజ్ చేసింది. ‘మిస్టేట్ ఆఫ్ ఫ్యాక్ట్’గా నిందితులందరికీ విముక్తి కల్పిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. అటు తీర్పు వెలువరించే ముందు తన వాదనలు వినాలన్న స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అప్పటి ఛైర్మన్ కె.అజయ్ రెడ్డి పిటిషన్‌ను తిరస్కరించింది.

News January 13, 2026

‘మన శంకరవరప్రసాద్ గారు’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

image

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ తొలి రోజు ప్రీమియర్స్‌తో కలిపి ఇండియాలో రూ.37.10 కోట్లు వసూలు చేసినట్లు ‘sacnilk’ పేర్కొంది. ఇందులో సోమవారం రూ.28.50 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ప్రీమియర్ షోల ద్వారా రూ.8.6 కోట్లు రాబట్టింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి కమర్షియల్ టచ్, పండుగ సీజన్‌తో పాటు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది.

News January 13, 2026

తక్కువ ఖర్చుతో పంటకు రక్ష, దిగుబడికి భరోసా

image

సాగులో ప్రకృతి వైపరీత్యాల కంటే చీడపీడలతోనే ఎక్కువ నష్టం జరుగుతోంది. ఈ సమస్య నివారణకు లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు, లైట్ ట్రాప్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి పురుగులను ఆకర్షించి, నిర్మూలించి వాటి ఉద్ధృతి పెరగకుండా కట్టడి చేస్తున్నాయి. దీంతో పురుగు మందుల వినియోగం తగ్గి, పర్యావరణానికి, మిత్ర పురుగులకు మేలు జరుగుతోంది. ఏ పంటకు ఏ పరికరం వాడితే లాభమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.