News November 17, 2024

తిరుమలలో అన్యమత ప్రచారం వదంతులు

image

తిరుమలలో ఓ వర్గం వారు అన్యమత ప్రచారం చేశారనే వదంతులు భక్తుల్లో కలకలం రేపుతున్నాయి. పాప వినాశనం దగ్గర అన్య మతస్తులు రీల్స్ చేశారనే ప్రచారం జోరుగా సాగడంతో టీటీడీ విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. నిజంగా అన్యమత ప్రచారం చేశారా? ఇది తిరుమలలోనే జరిగిందా? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

Similar News

News November 9, 2025

పాడి పశువుల పాలలో కొవ్వు శాతం ఎందుకు తగ్గుతుంది?

image

గేదె, ఆవు పాలకు మంచి ధర రావాలంటే వాటిలో కొవ్వు శాతం కీలకం. పశువుల వయసు ఎక్కువగా ఉన్నప్పుడు, ఈత చివరి దశలో సాధారణంగానే పాలలో కొవ్వు శాతం తగ్గుతుంది. పశువులను మరీ ఎక్కువ దూరం నడిపించినా, అవి ఎదలో ఉన్నా, వ్యాధులకు గురైనా, మేతను మార్చినప్పుడు, పచ్చి, ఎండుగడ్డిని సమానంగా ఇవ్వకున్నా పాలలో వెన్నశాతం అనుకున్నంత రాదు.✍️ వెన్నశాతం పెంచే సూచనలకు <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.

News November 9, 2025

వాయుకాలుష్యంతో ఊబకాయ ప్రమాదం

image

ప్రస్తుతకాలంలో కాలుష్యం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా వాయుకాలుష్యం మహిళల్లో ఊబకాయాన్ని కలిగిస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. డయాబెటీస్ కేర్ జర్నల్‌ అధ్యయనంలో దీర్ఘకాలం వాయుకాలుష్యానికి గురయ్యే మహిళల్లో అధిక కొవ్వుశాతం, తక్కువ లీన్ మాస్‌ ఉంటుందని తేలింది. ఊబకాయాన్ని దూరంగా ఉంచేందుకు ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలితో పాటు కాలుష్యానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

News November 9, 2025

OTTల్లోకి మూడు రోజుల్లో 4 సినిమాలు

image

ఈ నెల 14-16 వరకు మూడు రోజుల వ్యవధిలో నాలుగు కొత్త సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘తెలుసు కదా’, ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘డ్యూడ్’, ధ్రువ్ విక్రమ్ ‘బైసన్’ మూవీలు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 14న స్ట్రీమింగ్ కానున్నాయి. రష్మిక, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘థామా’ ఈ నెల 16న ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.