News November 17, 2024

‘తగ్గేదే లే’ సిగ్నేచర్ మూమెంట్‌తో క్రికెటర్లు

image

‘పుష్ప’ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మేనరిజం, ఆటిట్యూడ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో పాటు క్రికెటర్లూ ఫిదా అయ్యారు. ఈక్రమంలో వివిధ మ్యాచుల్లో వారంతా తగ్గేదే లే స్టెప్పులేశారు. తాజాగా ‘పుష్ప-2’ ట్రైలర్ రిలీజ్ నేపథ్యంలో ఆ సన్నివేశాలను అభిమానులు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. వారిలో కోహ్లీ, వార్నర్, జడేజా, రబాడా, రషీద్ ఖాన్, SRH ప్లేయర్లు, IND ఉమెన్ ప్లేయర్లు ఉన్నారు.

Similar News

News November 18, 2024

ఇవి తింటే ఇప్పుడే ముసలితనం

image

కొన్ని రకాల ఫుడ్స్ తింటే ముందుగానే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చక్కెర, పిండి పదార్థాలతో తయారుచేసే పిజ్జా, బర్గర్, పఫ్స్, స్వీట్లు తింటే అకాల వృద్ధాప్యం దరి చేరుతుంది. ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్, ప్యాకేజ్డ్, ప్రాసెస్‌డ్ ఫుడ్ తిన్నా చర్మంపై ముడతలు వచ్చి ముసలితనం కనిపిస్తుంది. టీ, కాఫీ, మద్యపానం ఎక్కువగా చేసినా త్వరగా ముసలివారు అయిపోతారు. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.

News November 18, 2024

బల్బ్ లేకముందు 12 గంటలు నిద్రపోయేవారు!

image

ఇప్పుడంటే లైట్స్, కరెంట్ అందుబాటులో ఉండటంతో అర్ధరాత్రి వరకూ నిద్రపోకుండా ఉంటున్నాం. ఎడిసన్ బల్బును కనుగొనక ముందు ఎలా ఉండేదో తెలుసా? 20వ శతాబ్దం ప్రారంభం వరకు ప్రతి ఒక్కరూ దాదాపు 10 నుంచి 12 గంటల వరకు నిద్రపోయేవారని నిపుణులు చెబుతున్నారు. ఇది వేసవిలో కాస్త తగ్గేదని అంటున్నారు. ప్రస్తుతం కృత్రిమ కాంతి వల్ల నిద్ర గురించి పూర్తిగా పట్టించుకోవట్లేదని గుర్తుచేస్తున్నారు.

News November 18, 2024

రేపు రాష్ట్రానికి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్

image

TG: రేపు రాష్ట్రంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటించనుంది. మధ్యాహ్నం 12 గంటలకు వికారాబాద్‌లోని లగచర్లకు వెళ్లి రైతులు, గిరిజనులతో సమావేశం కానుంది. అనంతరం కలెక్టర్‌పై దాడి కేసులో సంగారెడ్డి జైలులో ఉన్న వారిని కలవనుంది. తిరిగి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకొని అక్కడే బస చేయనుంది.