News November 17, 2024
తమిళనాడులో టాటాకు చెందిన ఐఫోన్ ఫ్యాక్టరీ
తమిళనాడులో ఐఫోన్ ప్లాంట్ కోసం తైవాన్‌కు చెందిన పెగట్రాన్‌తో టాటా సీల్స్ ఒప్పందం చేసుకుంది. ఐఫోన్ ప్లాంట్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు టాటా ఎలక్ట్రానిక్స్ అంగీకరించింది. 10,000 మంది ఉద్యోగులున్న ఈ ప్లాంట్‌లో టాటా 60% & పెగట్రాన్ 40% వాటాను కలిగి ఉన్నాయి. ఈ ప్లాంట్ ద్వారా ఏటా 5 మిలియన్ ఐఫోన్‌లను ఉత్పత్తి చేస్తున్నారు. మన దేశంలో టాటాకు చెందిన మూడో ఐఫోన్ ఫ్యాక్టరీ ఇది.
Similar News
News November 18, 2024
OTTలోకి వచ్చేసిన నయనతార డాక్యుమెంటరీ
నయనతార కెరీర్, ప్రేమ, పెళ్లిపై ‘నెట్‌ఫ్లిక్స్’ రూపొందించిన డాక్యుమెంటరీ విడుదలైంది. హిందీ, తెలుగు, ఇంగ్లిష్, తమిళ భాషల్లో ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘నయనతార-బియాండ్ ది ఫెయిరీ టేల్’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో ‘నానుం రౌడీదాన్’ మూవీకి సంబంధించిన ఫుటేజ్ వాడుకోవడంపై <<14626837>>నయన్, హీరో ధనుష్ మధ్య వివాదం<<>> తలెత్తిన సంగతి తెలిసిందే.
News November 18, 2024
వినూత్నం: చెక్కతో చేసిన ఉపగ్రహం
ప్రపంచంలో చెక్కతో తయారుచేసిన మొట్ట మొదటి ఉపగ్రహం ‘లిగ్నోశాట్’ను ఈనెల 5న అంతరిక్షంలోకి పంపారు. క్యోటో యూనివర్సిటీ & సుమిటోమో ఫారెస్ట్రీ పరిశోధకులు దీనిని అభివృద్ధి చేశారు. ఈ వినూత్న ఉపగ్రహం స్పేస్‌ఎక్స్ మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటుంది. భవిష్యత్తులో మూన్ & మార్స్‌పై అన్వేషణ కోసం కలపను పునరుత్పాదక పదార్థంగా ఉపయోగించవచ్చో లేదో పరీక్షించడం ఈ మిషన్ ఉద్ధేశ్యం.
News November 18, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.