News November 18, 2024

హెజ్బొల్లా కీలక నేత హతం

image

హెజ్బొల్లా మీడియా రిలేషన్స్ చీఫ్‌ మహ్మద్ అఫీఫ్‌ను ఇజ్రాయెల్ హతమార్చింది. బీరుట్‌లో జరిపిన ఐడీఎఫ్ వైమానిక దాడిలో అఫీఫ్ మృతి చెందారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం గాజాలోనూ దాడులు చేస్తోంది. ఇవాళ జరిపిన దాడుల్లో 12 మంది పౌరులు మరణించారు. కాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపై దాడి జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

Similar News

News April 16, 2026

కరివేపాకు మొక్కలు గుబురుగా పెరగాలంటే?

image

కరివేపాకు మొక్కలు ఒక మీటరు ఎత్తు పెరిగాక మొక్క చివర్లను తుంచాలి. ఇలా చేయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి మొక్కలు గుబురుగా పెరుగుతాయి. మూడేళ్లు వచ్చిన కరివేపాకు చిన్న కొమ్మలను మొక్క మొదలు వరకు తుంచి, 4 లేదా 5 శాఖలు ఉండేలా ఉంచితే ఎక్కువ దిగుబడి వచ్చి ఆదాయం పెరుగుతుంది. అలాగే పంట కోసిన తర్వాత ప్రతిసారీ 50 కిలోల నత్రజని, 50 కిలోల పొటాష్ అందించే ఎరువులను మొక్కలకు వేస్తూ ఉండాలి.

News April 16, 2026

కాజల్ చెప్పిన సమాధానం కరెక్టేనా?

image

‘హబ్4లెర్నింగ్’ అనే ట్విటర్ పేజీ పైన ఫొటోలో చూపిన ప్రశ్న అడిగింది. దీనికి హీరోయిన్ కాజల్ అగర్వాల్ 179 అని సమాధానం ఇచ్చారు. దీంతో కొందరు అది సరైన సమాధానమేనని, కాజల్ SSC CGL ఉద్యోగానికి క్వాలిఫై అవుతారంటూ కామెంట్ చేశారు. మరికొందరేమో అది తప్పు ఆన్సర్ అని, రైట్ ఆన్సర్ 190 అని చెబుతున్నారు. మరి కాజల్ చెప్పిన ఆన్సర్ కరెక్టేనా? అసలు సమాధానం ఏంటి? కామెంట్ చేయండి.

News April 16, 2026

రుగ్వేద శ్లోకంతో మోదీ స్పెషల్ ట్వీట్

image

మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్న తరుణంలో మోదీ ఆసక్తికర ట్వీట్ చేశారు. రుగ్వేదంలోని ఓ శ్లోకాన్ని షేర్ చేస్తూ మహిళల గొప్పతనాన్ని కొనియాడారు. ‘ఒక మహిళ తన జ్ఞానపు వెలుగుతో అజ్ఞానమనే చీకటిని తరిమికొట్టి ప్రపంచమంతా వెలుగులు నింపుతుంది. సంపదను, ఉన్నతమైన విలువలను కోరుకునే వారు ఎప్పుడూ వారిని గౌరవించాలి’ అని ఆ శ్లోకం అర్థం. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మహిళల పాత్ర కీలకమని మోదీ పేర్కొన్నారు.