News November 18, 2024

డిసెంబర్ 15 నాటికి కొత్త విధానం: నారాయణ

image

AP: భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి త్వరలోనే కొత్త విధానం అమల్లోకి తీసుకొస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. డిసెంబర్ 15 నాటికి ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని, దీనికి సంబంధించి త్వరలోనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామన్నారు. 20 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాతే కొత్త విధానం రూపొందించామని నెల్లూరులో అధికారులతో సమీక్షలో మంత్రి చెప్పారు. ప్రజలు తమ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు.

Similar News

News November 18, 2024

తెలంగాణ సచివాలయంలో మార్పులు!

image

TG: రాష్ట్ర సచివాలయం ప్రధాన గేట్లు, రోడ్లలో ప్రభుత్వం దాదాపు రూ.3కోట్లతో మార్పులు చేస్తోంది. తూర్పున ఉండే ప్రధాన గేటును(బాహుబలి గేటు) పూర్తిగా తొలగించింది. ఈశాన్యం వైపు ఇనుప గ్రిల్స్ తొలగించి మరో గేటును ఏర్పాటు చేస్తోంది. బాహుబలి గేటు నుంచి సచివాలయం లోపల ప్రధాన గేటుకు వెళ్లే మార్గంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయనుంది. నైరుతి, ఈశాన్య గేట్లను కలుపుతూ రోడ్డు నిర్మిస్తోంది.

News November 18, 2024

BGTలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లు

image

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన యాక్టివ్ ప్లేయర్లలో పుజారా టాప్‌లో ఉన్నారు. 24 టెస్టులు ఆడిన ఆయన 2,033 రన్స్ చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా విరాట్ కోహ్లీ (24 టెస్టులు, 1979 రన్స్), స్టీవ్ స్మిత్ (18 T, 1887 R), రహానే (17 T, 1090 R), లబుషేన్ (9 T, 708 R) ఉన్నారు. కాగా పుజారా, రహానే ఈనెల 22 నుంచి జరగనున్న సిరీస్‌కు ఎంపిక కాలేదన్న విషయం తెలిసిందే.

News November 18, 2024

OTTలోకి వచ్చేసిన నయనతార డాక్యుమెంటరీ

image

నయనతార కెరీర్, ప్రేమ, పెళ్లిపై ‘నెట్‌ఫ్లిక్స్’ రూపొందించిన డాక్యుమెంటరీ విడుదలైంది. హిందీ, తెలుగు, ఇంగ్లిష్, తమిళ భాషల్లో ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘నయనతార-బియాండ్ ది ఫెయిరీ టేల్’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో ‘నానుం రౌడీదాన్’ మూవీకి సంబంధించిన ఫుటేజ్ వాడుకోవడంపై <<14626837>>నయన్‌, హీరో ధనుష్ మధ్య వివాదం<<>> తలెత్తిన సంగతి తెలిసిందే.