News November 18, 2024
ఇవి తింటే ఇప్పుడే ముసలితనం
కొన్ని రకాల ఫుడ్స్ తింటే ముందుగానే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చక్కెర, పిండి పదార్థాలతో తయారుచేసే పిజ్జా, బర్గర్, పఫ్స్, స్వీట్లు తింటే అకాల వృద్ధాప్యం దరి చేరుతుంది. ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్, ప్యాకేజ్డ్, ప్రాసెస్‌డ్ ఫుడ్ తిన్నా చర్మంపై ముడతలు వచ్చి ముసలితనం కనిపిస్తుంది. టీ, కాఫీ, మద్యపానం ఎక్కువగా చేసినా త్వరగా ముసలివారు అయిపోతారు. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.
Similar News
News November 18, 2024
టీ అమ్ముకునే వాడంటూ మోదీని అవమానించారు: పవన్
టీ అమ్ముకునే వాడు ప్రధాని అవ్వడమేంటని నరేంద్ర మోదీని కొందరు అవహేళన చేశారని పుణే కంటోన్మెంట్ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ అన్నారు. ‘కొట్టు పెట్టి ఇస్తాం వచ్చి టీ అమ్ముకో’ అని అవమానించారని, అవన్నీ తట్టుకుని ఆయన 3 సార్లు PM అయ్యారని గుర్తుచేశారు. మోదీ మళ్లీ PM అవ్వకూడదని విపక్షాలు ప్రయత్నాలు చేస్తుంటే తాను పట్టుబట్టి APలో BJP, TDPతో కూటమిగా పోటీ చేసి 93% స్ట్రైకింగ్ రేట్‌తో విజయం సాధించామని తెలిపారు.
News November 18, 2024
ఆ వివరాలు వెల్లడించకపోతే ₹10లక్షల ఫైన్: IT
ITR ఫైల్ చేసేటప్పుడు పన్ను చెల్లింపుదారులు తమ విదేశీ ఆస్తులు, ఆదాయాన్ని వెల్లడించాలని IT శాఖ తెలిపింది. ఒకవేళ ఆ వివరాలు వెల్లడించకపోతే బ్లాక్ మనీ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ యాక్ట్ 2015 కింద రూ.10లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. విదేశాల్లో బ్యాంక్ ఖాతాలు, బీమా ఒప్పందాలు, ట్రస్టులు, ఇతర ఆస్తుల వివరాలను తెలపాలని సూచించింది. సవరించిన ITR ఫైల్ చేసేందుకు గడువు DEC 31తో ముగియనుంది.
News November 18, 2024
తెలంగాణ సచివాలయంలో మార్పులు!
TG: రాష్ట్ర సచివాలయం ప్రధాన గేట్లు, రోడ్లలో ప్రభుత్వం దాదాపు రూ.3కోట్లతో మార్పులు చేస్తోంది. తూర్పున ఉండే ప్రధాన గేటును(బాహుబలి గేటు) పూర్తిగా తొలగించింది. ఈశాన్యం వైపు ఇనుప గ్రిల్స్ తొలగించి మరో గేటును ఏర్పాటు చేస్తోంది. బాహుబలి గేటు నుంచి సచివాలయం లోపల ప్రధాన గేటుకు వెళ్లే మార్గంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయనుంది. నైరుతి, ఈశాన్య గేట్లను కలుపుతూ రోడ్డు నిర్మిస్తోంది.