News November 18, 2024
HYDలో రేపే ఫుట్‌బాల్ మ్యాచ్

హైదరాబాద్‌లో రేపు ఇండియా, మలేషియా మధ్య ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరగనుంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా రేపు రాత్రి 7 గంటలకు ఫుట్ బాల్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ భారీగా ఏర్పాట్లు చేస్తుంది. ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
Similar News
News April 18, 2026
KPHBలో తృటిలో తప్పిన పెను ప్రమాదం!

KPHB మెట్రో పిల్లర్ నంబర్ A-834 వద్ద శుక్రవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. గచ్చిబౌలి నుంచి పాలకొల్లు వెళ్తున్న ఈ బస్సులో 18 మంది ప్రయాణికులు ఉండగా, అప్రమత్తతతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. అధికారులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.

News April 17, 2026
రంగారెడ్డిలో భానుడి భగభగ.. జనం విలవిల

ఉమ్మడి జిల్లాను ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భానుడి భగభగలకు జనం విలవిలలాడుతున్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్‌లో 41.8, మేడ్చల్‌లో 41.7 డిగ్రీల వేడి రికార్డయ్యింది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. మధ్యాహ్నం వేళ రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.