News November 18, 2024
కూటమి ప్రభుత్వం నటిస్తోంది: మాజీ మంత్రి బుగ్గన
HYDలోని ప్రెస్ క్లబ్‌లో ఆదివారం మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. గత YCP ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ DBT ద్వారానే ఇచ్చామని తెలిపారు. తమ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో అకౌంట్లో ఉంది. ఎవరికి ఇచ్చామో బ్యాంక్ రికార్డ్స్‌లో ఉంది అని స్పష్టం చేశారు. ఇక ఇందులో స్కామ్‌కు అవకాశమే లేదని, అప్పుల లెక్కల విషయంలో కూటమి ప్రభుత్వం బాగా నటిస్తోంది అని బుగ్గన ఫైరయ్యారు.
Similar News
News November 18, 2024
కర్నూలు: కూరలో మాత్రలు కలిపిన విద్యార్థులు.. 9 మంది ఆస్పత్రి పాలు
కర్నూలు సీ.క్యాంపులోని ప్రభుత్వ బాలుర వికలాంగుల హాస్టల్‌లో ఇద్దరు అకతాయిలు చేసిన పనికి 9మంది అస్వస్థతకు గురయ్యారు. కూరలో గుర్తుతెలియని మాత్రలు కలపడంతో అది తిన్న వారు తీవ్ర అస్వస్థతతకు గురయ్యారని జిల్లా వికలాంగుల శాఖ సహాయ సంచాలకులు రయీస్ ఫాతిమా తెలిపారు. పీజీ విద్యార్థి ఓ 8వ తరగతి విద్యార్థితో కలిసి శనివారం రాత్రి సొరకాయ కూరలో మాత్రలు కలిపారన్నారు. బాధితులను కర్నూలు ఆస్పత్రికి తరలించామన్నారు.
News November 18, 2024
విద్యుత్ శాఖ సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధం
మహానంది మండలం తిమ్మాపురం సమీపంలోని కృష్ణనంది వెళ్లే మార్గంలో విద్యుత్ షాక్‌తో నాగూర్ బాషా, డ్రైవర్ రాఘవేంద్ర నిన్న మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు మండల అసిస్టెంట్ ఇంజినీర్ ప్రభాకర్ రెడ్డి, లైన్‌మెన్ రామ పుల్లయ్యపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఇద్దరిపై సస్పెన్షన్ వేటు పడనున్నట్లు సమాచారం.
News November 17, 2024
ఈనెల 18న అభ్యర్థులకు కౌన్సెలింగ్
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో వార్డెన్లు, పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 18న కర్నూలులోని డీఈవో కార్యాలయంలో కౌన్సెలింగ్ ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని ఆయన సూచించారు.