News November 18, 2024
శ్రీ సత్య సాయి బాబా జయంతి వేడుకలకు పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ

శ్రీ సత్య సాయి బాబా 99వ జయంతి వేడుకలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. సోమవారం ఉదయం పట్టణంలో శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవంతో వేడుకలు ప్రారంభమవుతున్న దృశ్యం పట్టణంలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 14 పోలీస్ టీంలు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించడం జరుగుతుందన్నారు.
Similar News
News January 16, 2026
అనంత: మరదలిని సుత్తితో కొట్టి చంపిన బావ

హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి శ్రీరామ్‌నగర్‌లో గురువారం సాయంత్రం దారుణ హత్య జరిగింది. సొంత మరదలిని(17) సుత్తితో కొట్టి బావ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు అనంతపురానికి చెందిన పవన్ కుమార్(25)గా గుర్తించారు. హత్యకు గల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు జగద్గిరిగుట్ట పోలీసులు వెల్లడించారు.
News January 16, 2026
అనంత: కొండెక్కిన కోడి ధరలు

ఫర్వాట సందర్భంగా గుత్తిలో చికెన్, మటన్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. కేజీ చికెన్ ధర రూ.270, స్కిన్ లెస్ రూ.290 పలుకుతోంది. మరోపక్క కేజీ మటన్ రూ. 750 ఉండగా.. ఒక్కసారిగా రూ.50 పెరిగి రూ.800 కి విక్రయిస్తున్నట్లు మటన్ షాప్ నిర్వాహకుడు ఖురేషి అన్వర్ తెలిపారు. గుంతకల్లులో కేజీ చికెన్ రూ.270 ఉండగా, అనంతపురంలో రూ.260-270 ఉంది.
News January 14, 2026
గ్రామీణ సంస్కృతి ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు

గ్రామీణ సంస్కృతికి దర్పణం పట్టే విధంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. అనంతపురం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన సంప్రదాయ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. సంక్రాంతి సంబరాలలో ఎస్పీ జగదీశ్ దంపతులు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. భోగి మంటలు వెలిగించి గాలిపటాలు ఎగురవేశారు. ఎస్పీ గుండాట ఆడి, ఉట్టి కొట్టారు.


