News November 18, 2024

ఆ వివరాలు వెల్లడించకపోతే ₹10లక్షల ఫైన్: IT

image

ITR ఫైల్ చేసేటప్పుడు పన్ను చెల్లింపుదారులు తమ విదేశీ ఆస్తులు, ఆదాయాన్ని వెల్లడించాలని IT శాఖ తెలిపింది. ఒకవేళ ఆ వివరాలు వెల్లడించకపోతే బ్లాక్ మనీ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ యాక్ట్ 2015 కింద రూ.10లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. విదేశాల్లో బ్యాంక్ ఖాతాలు, బీమా ఒప్పందాలు, ట్రస్టులు, ఇతర ఆస్తుల వివరాలను తెలపాలని సూచించింది. సవరించిన ITR ఫైల్ చేసేందుకు గడువు DEC 31తో ముగియనుంది.

Similar News

News November 18, 2024

11 నెలల్లో గురుకులాల్లో 42 మంది విద్యార్థులు మృతి: హరీశ్ రావు

image

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని గురుకులాల్లో 42 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్, ఆత్మహత్యల కారణంగా మరణించారని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. దీనికి సీఎం రేవంత్, ప్రభుత్వమే బాధ్యత వహించి విద్యార్థికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మరణించిన వారి వివరాలను ఆయన పంచుకున్నారు. వరుస మరణాలు నమోదవుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడట్లేదని దుయ్యబట్టారు.

News November 18, 2024

మ‌హారాష్ట్ర‌లో నేటితో ప్ర‌చార ప‌ర్వానికి తెర‌

image

MH అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి సోమ‌వారంతో తెర‌ప‌డ‌నుంది. మొత్తం 288 స్థానాలకు బుధ‌వారం (Nov 20) ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రాష్ట్రంలో 9.7 కోట్ల మంది ఓట‌ర్లు ఉన్నారు. వీరిలో 4.93 కోట్ల మంది పురుషులు, 4.6 కోట్ల మంది మ‌హిళలు ఉన్నారు. అధికార మ‌హాయుతి, విప‌క్ష MVA కూట‌ముల్లోని 6 పార్టీల మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంది. MNS, MIM, VBA పార్టీలు ఇతరుల ఓట్ల‌కు గండికొట్టే ఛాన్స్ ఉంది. 23న కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది.

News November 18, 2024

ఢిల్లీలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత

image

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఇవాళ ఉదయం AQI 793గా నమోదైంది. దేశంలో అత్యంత కాలుష్య నగరాల్లో ఫతేబాద్(895) తర్వాతి స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో నోయిడా(559) ఉంది. కాగా ఇవాళ్టి నుంచి ఢిల్లీలో స్టేజ్-4 ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం ట్రక్కులను నగరంలోకి అనుమతించరు. మరోవైపు 10, 12వ తరగతులు మినహా మిగతా క్లాసులు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఆప్ ప్రభుత్వం ఆదేశించింది.