News November 18, 2024

టెట్ అభ్యర్థులకు అలర్ట్

image

TG: టెట్ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇవాళ్టి నుంచి ఈనెల 22 వరకు పాఠశాల విద్యాశాఖ <>సైట్‌లో<<>> అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. మరోవైపు దరఖాస్తు గడువు ఈనెల 20తో ముగియనుంది. ఇప్పటివరకూ సుమారు లక్షన్నర దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఏవైనా టెక్నికల్ సమస్యలు వస్తే 7032901383, 9000756178 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.

Similar News

News November 18, 2024

త్వరలో కీరవాణి కుమారుడి పెళ్లి

image

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు. సీనియర్ నటుడు మురళీమోహన్ మనవరాలు రాగను ఆయన వివాహమాడనున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లో వీరి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు ప్రిన్స్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి, నటులు నరేశ్, పవిత్ర, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తదితరులు హాజరయ్యారు.

News November 18, 2024

వెంటనే IR ప్రకటించాలి: APTF

image

APలో NDA ప్రభుత్వం ఏర్పడి 5 నెలలైనా ఇంకా టీచర్లు, ఉద్యోగులకు ఎలాంటి భరోసా కల్పించలేదని APTF ఆరోపించింది. పెండింగ్ DAలు, వేతన సవరణ గడువు రెండేళ్లు దాటినా ఇంకా నిర్ణయం తీసుకోలేదని మండిపడింది. గత ప్రభుత్వం నియమించిన PRC కమిషన్ ఛైర్మన్ ప్రభుత్వం మారిన తర్వాత రాజీనామా చేశారని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరింది. PRC ప్రకటించే వరకూ ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేసింది.

News November 18, 2024

PDS ధాన్యం పక్కదారి.. రూ.69 వేల కోట్ల నష్టం

image

PDS ద్వారా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌ర‌ఫ‌రా చేసిన ఆహార ధాన్యాలు ప‌క్క‌దారి ప‌ట్ట‌డంతో ₹69 వేల కోట్ల న‌ష్టం వాటిల్లిన‌ట్టు ఎకాన‌మిక్ థింక్ ట్యాంక్ అధ్య‌య‌నంలో తేలింది. 28% లబ్ధిదారుల‌కు ధాన్యం చేర‌డం లేద‌ని వెల్ల‌డైంది. ఆగ‌స్టు, 2022-జులై, 2023 మ‌ధ్య కాలానికి సంబంధించి సంస్థ అధ్య‌య‌నం చేసింది. ధాన్యాన్ని ఓపెన్ మార్కెట్, ఇత‌ర ఎగుమ‌తుల‌కు మ‌ళ్లించివుంటార‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.