News November 18, 2024

22 జిల్లాల్లో మహిళా శక్తి భవనాలు.. ఉత్తర్వులు జారీ

image

TG: మహిళా సంఘాల బలోపేతం కోసం మహిళా శక్తి భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని పాత 10 జిల్లాల్లో ఇప్పటికే ఈ భవనాలు ఉండగా, మిగతా జిల్లాల్లోనూ నిర్మించనుంది. ఒక్కో భవనానికి రూ.5కోట్లు చొప్పున మొత్తం రూ.110కోట్లు ఖర్చు చేయనుంది. ఇందుకు సంబంధించి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రేపు హనుమకొండలో జరగనున్న సభలో సీఎం రేవంత్ రెడ్డి వీటి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

Similar News

News April 18, 2026

సంగారెడ్డి: ఈనెల 20 నుంచి ఓపెన్ పరీక్షలు

image

సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఇప్పటికే ఏప్రిల్ 9 నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని, పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు.

News April 18, 2026

మహిళా బిల్లును ప్రవేశపెట్టిన DMK

image

డీలిమిటేషన్‌కు లింక్ చేసి ప్రవేశపెట్టిన మహిళా బిల్లు నిన్న వీగిపోయిన నేపథ్యంలో NDAకు కౌంటర్‌గా రాజ్యసభలో DMK ఈరోజు ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టింది. డీలిమిటేషన్, సెన్సస్‌ అవసరం లేకుండా 543 లోక్‌సభ స్థానాల్లోనే 33% మహిళలకు కేటాయించాలని ప్రతిపాదించింది. రాష్ట్రాలు, UTలైన పుదుచ్చేరి, జమ్మూకశ్మీర్ సహా ఢిల్లీ NCRకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. సీట్లను, నియోజకవర్గ పరిధులను మార్చాల్సిన అవసరం లేదంది.

News April 18, 2026

రోజుకు 8 గంటలు కష్టపడుతున్న రష్మిక

image

రవీంద్ర పుల్లే డైరెక్షన్‌లో రష్మిక లీడ్ రోల్ చేస్తున్న ‘మైసా’ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో గిరిజన మహిళ పాత్ర పోషిస్తున్న ఆమె యాక్షన్ సీక్వెన్స్ కోసం బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. రోజుకు 8 గంటలపాటు స్టంట్ కోఆర్డినేషన్, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ట్రైనింగ్(ఆర్మీ తరహా శిక్షణ) తీసుకుంటున్నారు. త్వరలో కేరళంలో 16 రోజుల పాటు యాక్షన్ షెడ్యూల్‌కు మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం.