News November 18, 2024
స్కూళ్ల టైమింగ్స్ మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే..
AP: రాష్ట్రంలో ప్రస్తుతం ఉ.9 గం. నుంచి సా.4 గం. వరకు స్కూళ్లు నడుస్తుండగా దాన్ని సా.5 గం. వరకు విద్యాశాఖ పొడిగించింది. ఈనెల 25-30 వరకు కొత్త టైమ్‌టేబుల్‌ను తొలుత ప్రతి మండలంలోని 2 బడుల్లో అమలు చేయనుంది. దీని ప్రకారం ఉదయం, మధ్యాహ్నం ఇచ్చే బ్రేక్ సమయాన్ని 5 ని. చొప్పున, భోజన విరామాన్ని 15ని. పెంచారు. ఉ. తొలి పీరియడ్ 5ని. పెంచి 50ని. చేశారు. తర్వాతి 3 పీరియడ్లను కూడా 5ని. చొప్పున పెంచి 45ని. చేశారు.
Similar News
News November 18, 2024
లా అండ్ ఆర్డర్‌పై మండలిలో హాట్ హాట్ చర్చ
AP శాసనమండలిలో లా అండ్ ఆర్డర్‌పై చర్చ అధికార, విపక్షాల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. రాష్ట్రంలో నేరాల కట్టడికి చర్యలు చేపడుతున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. జగన్ తల్లికి, చెల్లికి అన్యాయం జరిగినా అండగా నిలుస్తామని ఆమె అన్నారు. దీంతో అనిత వ్యాఖ్యలపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు.
News November 18, 2024
బీజేపీలో చేరనున్న గహ్లోత్!
కేజ్రీవాల్ తీరుపై తీవ్ర విమర్శలు చేసి మంత్రి పదవికి <<14635271>>రాజీనామా<<>> చేసిన కైలాష్ గహ్లోత్ బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు గహ్లోత్ సన్నిహితుడు. పంద్రాగస్టున జెండా ఎగురవేసేందుకు ఆతిశీకి బదులుగా గహ్లోత్‌కు సక్సేనా అవకాశం ఇచ్చారు. పైగా లిక్కర్ కేసులో ఆయన పాత్రపై ED కూపీ లాగుతుండడంతోనే బీజేపీలో చేరుతున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
News November 18, 2024
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఇటీవల తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.660 పెరిగి రూ.76,310కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.600 పెరిగి రూ.69,950గా నమోదైంది. మరోవైపు సిల్వర్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేజీ వెండి ధర రూ.99వేలుగా ఉంది.