News November 18, 2024

విజయవాడ: RTC డ్రైవర్‌పై దాడి.. కేసు నమోదు

image

విజయవాడ కృష్ణలంకలో ఆదివారం సాయంత్రం RTC డ్రైవర్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కృష్ణలంక సీఐ నాగరాజు స్పందిస్తూ.. డ్రైవర్ కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేశామని చెప్పారు. RTC డ్రైవర్ బస్టాండ్ నుంచి తెనాలివైపు వస్తుండగా ఇనోవా కారులో ఉన్న వ్యక్తులు అడ్డగించి దాడి చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనంతరం వారిని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశామని సీఐ వెల్లడించారు.

Similar News

News November 18, 2024

కృష్ణా: బీ- ఫార్మసీ 5వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో బీ- ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. డిసెంబర్ 3, 5, 7, 10, 12 తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్ట్ వారీగా టైమ్ టేబుల్, పరీక్ష కేంద్రాల వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది. 

News November 18, 2024

జగ్గయ్యపేట: మద్యం మత్తులో మహిళపై ఉపాధ్యాయుడి దాడి

image

జగ్గయ్యపేట పట్టణ పరిధిలోని ధనం బోర్డు కాలనీలో వివాహిత మణిపై ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు సాంబశివరావు మద్యం మత్తులో బ్లేడుతో శనివారం రాత్రి 11:30 సమయంలో నిద్రపోతున్న మహిళ గొంతు కోశాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్త్రావం కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

News November 18, 2024

సోషల్ మీడియాలో సైతం మద్యం వ్యాపారాలు: దేవినేని అవినాశ్

image

విజయవాడలో మద్యం డోర్ డెలివరీ చేస్తామంటూ ఇటీవల ఓ పోస్ట్ వైరల్ అయింది. దీనిపై YCP NTR జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. మద్యం డోర్ డెలివరి చేస్తామంటూ ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. కూటమి పాలనలో ఏకంగా సోషల్ మీడియాలో సైతం వాపారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వం గడప వద్దేకే సంక్షేమం అందిస్తే.. కూటమి ప్రభుత్వం గడప వద్దకే మద్యం అందించి మత్తులో ఉంచుతోందన్నారు.