News November 18, 2024
నెల్లూరు: ‘ఎక్కువ రేట్లకు మద్యం అమ్మితే చర్యలు’

నెల్లూరు జిల్లాలో బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టీ.శ్రీనివాసరావు వెల్లడించారు. జిల్లాలో అధిక ధరలకు మద్యం విక్రయాలపై ఆయన స్పందించారు. వ్యాపారులు MRP కన్నా ఎట్లక్కువ రేకు మద్యం అమ్మితే రూ.5లక్షల ఫైన్ విధిస్తామన్నారు. షాపుల్లో ధరల బోర్డ్ ఏర్పాటు చేయాలన్నారు. వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తే 9440902509, 8374684689 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.
Similar News
News February 15, 2026
నెల్లూరు: లేడీస్.. బీ అలర్ట్!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బంగారం ధర తులం రూ.1.60 లక్షలు దాటడంతో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. గత 6నెలల్లోనే 60కి పైగా స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఒంటరి మహిళలే లక్ష్యంగా నంబర్ ప్లేట్ లేని బైకులపై వచ్చి నగలు, తాలిబొట్లు లాకెళ్తున్నారు. తాజాగా గూడూరులో ఓ టీచర్‌పై బంగారం కోసం దాడి చేయడం కలకలం రేపింది. నగలు ధరించి బయటకు వెళ్లేటప్పుడు మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.
News February 15, 2026
నెల్లూరు: ప్రిన్సిపల్ సంతకం లేకున్నా.. ఓకే!

నెల్లూరు జిల్లాలో ఈనెల 23వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఫీజు బకాయిలు పేరుతో విద్యార్థులను కాలేజీ వాళ్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐవో వరప్రసాద్ రావు హెచ్చరించారు. ప్రభుత్వ వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై ప్రిన్సిపల్స్ సంతకం లేకున్నా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు.
News February 15, 2026
శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాల పేర్లు తెలుసా…!

బ్రహ్మోత్సవాలు అంటే వాహన సేవలు అని తెలుసు. కానీ శ్రీకాళహస్తిలో 9 రోజులు జరిగే వాటిని నవరాత్రి బ్రహ్మోత్సవాలు అని అంటారు. దానికి పేర్లు ఉన్నాయి. 1వరోజు దేవరాత్రి, 2వరోజు భూతరాత్రి, 3వ రోజు గాంధర్వ రాత్రి, 4వరోజు నాగరాత్రి, 5వరోజు శివరాత్రి, 6వరోజు బ్రహ్మ రాత్రి, 7వరోజు స్కంద రాత్రి, 8వరోజు ఆనంద రాత్రి, 9వరోజు ఋషి రాత్రి అంటారు.


